Gangavalli Kura Pappu : గంగ‌వ‌ల్లి ఆకుల‌తో ప‌ప్పును ఇలా వండాలి.. ఒక్క ముద్ద పెట్టుకుంటే ఆహా అంటారు..

Gangavalli Kura Pappu : గంగ‌వ‌ల్లి కూర‌.. దీనినే గంగ‌వాయిల కూర అని కూడా అంటారు. ఇత‌ర ఆకుకూర‌ల వ‌లె ఈ ఆకుకూర కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా ఈ ఆకుకూర క‌లిగి ఉంటుంది. ఈ గంగ‌వ‌ల్లి ఆకుకూర‌తో చేసే ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. గంగ‌వ‌ల్లి ఆకుకూర‌తో ప‌ప్పును రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గంగ‌వ‌ల్లి కూర ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – 100 గ్రా., త‌రిగిన గంగ‌వ‌ల్లి – 4 క‌ట్ట‌లు ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన ట‌మాటాలు – 2, నాన‌బెట్టిన చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఇంగువ – పావు టీ స్పూన్.

Gangavalli Kura Pappu recipe in telugu how to cook this
Gangavalli Kura Pappu

గంగ‌వ‌ల్లి కూర ప‌ప్పు త‌యారీ విధానం..

ముందుగా ఒక కుక్క‌ర్ లో కందిప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత శుభ్రం చేసుకున్న గంగ‌వ‌ల్లి కూర‌, ట‌మాట ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ‌, ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టాలి. ఈ పప్పును మూడు విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. త‌రువాత మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత ప‌సుపు, ఉప్పు, కారం, చింత‌పండు ర‌సం వేసి క‌ల‌పాలి. ఈ ప‌ప్పును మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఇంగువ వేసి వేయించాలి.

త‌రువాత ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత ఉడికించుకున్న ప‌ప్పును వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గంగ‌వ‌ల్లి కూర ప‌ప్పు త‌యార‌వుతుంది. దీనిని ఇంట్లో అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు. అన్నం, చ‌పాతీ వంటి వాటితో ఈ ప‌ప్పును క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌ప్పును తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు.

D

Recent Posts