Kidney Stones : కిడ్నీ స్టోన్స్ స‌మ‌స్య‌కు అద్భుత‌మైన చిట్కాలు.. త‌ప్ప‌క ఫ‌లితం ఉంటుంది..

Kidney Stones : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మూత్ర‌పిండాల్లో రాళ్ల కార‌ణంగా విప‌రీత‌మైన నొప్పి, మూత్ర‌విస‌ర్జ‌న స‌క్ర‌మంగా లేక‌పోవ‌డం, తీవ్ర‌మైన బాధ క‌లుగుతుంది. మందులు, శ‌స్త్ర చికిత్స‌లు అంటూ అనేక ర‌కాల ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. అస‌లు మూత్ర‌పిండాల్లో రాళ్లు రావ‌డానికి గ‌ల కార‌ణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నీటిని త‌క్కువ‌గా తాగ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో మ‌లినాలు పేరుకుపోయి అవి చిన్న చిన్న స్ఫ‌టికాలుగా ఏర్ప‌డ‌తాయి. క్ర‌మంగా ఈ స్ఫ‌టికాలు చిన్న చిన్న రాళ్ల‌లాగా త‌యార‌వుతాయి. అలాగే క్యాల్షియం ఎక్కువ‌గా ఉండే ఆహారాలు అన‌గా పాలు, ట‌మాటలు, పాల‌కూర వంటి వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌తాయి.

అదే విధంగా ఎక్కువ‌గా వ్యాయామం చేయ‌డం వ‌ల్ల కూడా మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య త‌లెత్తుతుంది. అలాగే యూరీన‌రి ట్రాక్ ఇన్ఫెక్ష‌న్ ల కార‌ణంగా కూడా మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య వ‌స్తుంది. అలాగే యూరిక్ యాసిడ్ స్థాయిలు శ‌రీరంలో ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల అవి మూత్ర‌పిండాల్లో స్ఫ‌టికాలుగా ఏర్ప‌డ‌తాయి. ఇవి క్ర‌మంగా రాళ్ల త‌యార‌వుతాయి. అలాగే షుగ‌ర్, బీపీ, హైప‌ర్ థైరాయిడిజం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారిలో కూడా ఈ స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఈ విధంగా అనేక కార‌ణాల చేత మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌తాయి. ఇలా మూత్ర‌పిండాల్లో త‌యారైన రాళ్లు మూత్ర నాళాల్లో, మూత్రాశ‌యంలో చేరి మూత్ర‌విస‌ర్జ‌న‌కు ఆటంకం క‌లిగిస్తూ ఉంటాయి. ఆయుర్వేద చిట్కాల‌ను ఉప‌యోగించి మ‌నం ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

Kidney Stones home remedies in telugu works effectively
Kidney Stones

ఈ చిట్కాల‌ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం 100 గ్రాముల అర‌టి బోద‌, 50 మిల్లీ లీట‌ర్ల మ‌జ్జిగ‌ను, 3 గ్రాముల సైంధ‌వ ల‌వ‌ణాన్ని, అర క‌ప్పు నీటిని తీసుకోవాలి. ముందుగా అర‌టి బోధ‌ను నీటిలో నాన‌బెట్టాలి. త‌రువాత ఈ అర‌టి బోధ‌ను ముక్క‌లుగా త‌ర‌గాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత దీని నుండి ర‌సాన్ని తీసి ఒక గ్లాస్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ర‌సానికి మ‌జ్జిగ‌ను, నీళ్ల‌ను, సైంధ‌వ ల‌వ‌ణాన్ని క‌లిపి తాగాలి. ఇలా రెండు నెల‌ల పాటు తాగ‌డం వ‌ల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ప‌డిపోతాయ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా మున‌గ చెట్టు బెర‌డు చూర్ణాన్ని 60 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. అలాగే ఒక చిటికెడు సైంధ‌వ ల‌వ‌ణాన్ని, పొంగించిన ఇంగువ పొడిని చిటికెడు మోతాదులో తీసుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో నాలుగు క‌ప్పుల నీటిని తీసుకుని వేడి చేయాలి.

నీళ్లు కొద్దిగా వేడ‌య్యాక అందులో మున‌గ చెట్టు బెర‌డు పొడిని వేసి ఒక క‌ప్పు క‌షాయం అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. ఇలా మ‌రిగించిన త‌రువాత వ‌డ‌క‌ట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న క‌షాయానికి ఇంగువ పొడి, సైంధ‌వ ల‌వ‌ణం క‌లిపి తాగాలి. ఇలా రెండు నెల‌ల పాటు రోజుకు రెండు సార్లు తాగ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అలాగే ఒక గిన్నెలో రెండు క‌ప్పుల నీటిని, ఒక చారెడు ఉల‌వ‌ల‌ను క‌లిపి ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఉల‌వ‌ల‌ను ఒక రాత్రంతా అలాగే ఉంచాలి. మ‌రుస‌టి రోజూ వీటిని వ‌డ‌క‌ట్టి నీటిని మాత్ర‌మే తాగాలి. ఇలా రెండు నెల‌ల పాటు తాగ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య తొల‌గిపోతుంది. ఈ చిట్కాల‌ను పాటిస్తూనే రోజుకు 3 నుండి 4 లీట‌ర్ల నీటిని తాగాలి. అలాగే చ‌క్క‌టి ఆహార నియ‌మాల‌ను, చ‌క్క‌టి జీవ‌న విధానాన్ని పాటించ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts