Gongura Tomato Nilva Pachadi : గోంగూర ట‌మాటా నిల్వ ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. అన్నంలో నెయ్యితో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Gongura Tomato Nilva Pachadi : గోంగూర ట‌మాట నిల్వ ప‌చ్చ‌డి.. గోంగూర‌, ట‌మాటాలు క‌లిపి చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నం నెయ్యితో తింటే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ ప‌చ్చ‌డి నిల్వ కూడా ఉంటుంది. ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. దీనిని త‌యారు చేసుకోవ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే గోంగూర టమాట ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గోంగూర ట‌మాట నిల్వ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టీ స్పూన్, మెంతులు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 20 నుండి 25, గోంగూర – 200 గ్రా., త‌రిగిన ట‌మాటాలు – 200 గ్రా., ఉప్పు – త‌గినంత‌.

Gongura Tomato Nilva Pachadi recipe in telugu make in this method
Gongura Tomato Nilva Pachadi

తాళింపుకు కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 10, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఇంగువ – కొద్దిగా.

గోంగూర ట‌మాట నిల్వ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మెంతులు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి చ‌క్క‌గా వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత గోంగూర‌ను శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా ఆర‌బెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత గోంగూర‌, ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిని క‌లుపుతూ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మ‌గ్గించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా మ‌గ్గిన త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి మిక్సీ ప‌ట్టుకున్న కారం, ఉప్పు వేసి క‌ల‌పాలి.

దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు ప‌దార్థాలు వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత దీనిని ముందుగా త‌యారు చేసుకున్న ప‌చ్చ‌డిలో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర ట‌మాట ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts