Oily Skin Home Remedies : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ ముఖంపై జిడ్డు అస‌లు లైఫ్‌లో రాదు..!

Oily Skin Home Remedies : మ‌న‌లో చాలా మంది జిడ్డు చ‌ర్మం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. జిడ్డు చ‌ర్మం కార‌ణంగా మొటిమ‌లు, బ్లాక్ హెడ్స్ వంటి స‌మ‌స్య‌లు కూడా వ‌స్తూ ఉంటాయి. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది ముఖాన్ని త‌రుచూ నీటితో క‌డుగుతూ ఉంటారు. టిష్యూ పేప‌ర్స్ తో ముఖాన్ని తుడుస్తూ ఉంటారు. ఇలా ఎన్ని విధాల ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి వారిలో చ‌ర్మం జిడ్డుగా మారుతూనే ఉంటుంది. చ‌ర్మం జిడ్డుగా మార‌డానికి వివిధ కార‌ణాలు ఉంటాయి. మనం తీసుకునే ఆహారం కూడా దీనికి ఒక కార‌ణ‌మే. మ‌నం తీసుకునే ఆహారంలో ఉండే వ్య‌ర్థాలు, శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు ఇలా జిడ్డు రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తూ ఉంటాయి. చ‌ర్మం జిడ్డుగా మార‌డం వ‌ల్ల ముఖం కూడా కొద్దిగా అంద‌విహీనంగా క‌నిపిస్తుంది. ఇలా చ‌ర్మం జిడ్డుగా మార‌కుండా ఉండాలంటే మ‌నం కొన్ని చిట్కాల‌ను పాటించాల‌ని నిపుణులు చెబుతున్నారు.

చ‌ర్మం ఎక్కువ‌గా జిడ్డుగా మారే వారు రోజూ 3 నుండి 4 లీట‌ర్ల నీటిని తాగాలి. ఇలా నీటిని తాగ‌డం వ‌ల్ల వ్య‌ర్థాలు మ‌లం, మూత్రం, చెమట ద్వారా బ‌య‌ట‌కు పోతాయి. అలాగే వారానికి 3 నుండి 4 సార్లు ముఖానికి ఆవిరి ప‌ట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖ భాగంలో పేరుకుపోయిన వ్య‌ర్థాలు సుల‌భంగా బ‌య‌ట‌కు పోతాయి. చ‌ర్మం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌మ‌వుతుంది. అలాగే రోజూ 30 నుండి 40 శాతం పండ్ల‌ను, పండ్ల ర‌సాల‌ను ఆహారంగా తీసుకోవాలి. పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి సూక్ష్మ పోష‌కాలు అందుతాయి. సూక్ష్మ పోష‌కాలు అంద‌డం వ‌ల్ల చ‌ర్మ క‌ణాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే చ‌ర్మ క‌ణాలు శుభ్ర‌ప‌డతాయి. పండ్ల ర‌సాల‌ను, పండ్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ముఖం కాంతివంతంగా త‌యార‌వుతుంది.

Oily Skin Home Remedies follow these for effective results
Oily Skin Home Remedies

అలాగే ఉద‌యం పూట క్యారెట్, బీట్ రూట్, కీర‌దోస వేసి జ్యూస్ చేసి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు చ‌ర్మ కాంతివంతంగా త‌యార‌వుతుంది. అలాగే సాయంత్రం స‌మ‌యంలో పండ్ల‌ను మాత్ర‌మే ఆహారంగా తీసుకోవాలి. అది కూడా 6 నుండి 7 గంట‌ల లోపే తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో వ్య‌ర్థాలు త‌గ్గుతాయి. చ‌ర్మ క‌ణాల్లో పేరుకుపోయిన వ్య‌ర్థాలు, విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి. ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చ‌ర్మం జిడ్డుగా మార‌డం త‌గ్గుతుంది. చ‌ర్మ ఆరోగ్యం మ‌రియు అందం కూడా పెరుగుతుంది. అలాగే శ‌రీర ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.

Share
D

Recent Posts