vastu

Money : ఇంటి పెర‌ట్లో ఈ 3 మొక్క‌ల‌ను పెంచితే.. ధ‌న ప్ర‌వాహ‌మే.. డ‌బ్బు బాగా సంపాదిస్తారు..!

Money : డ‌బ్బు సంపాదించ‌డం అన్న‌ది ప్ర‌స్తుత త‌రుణంలో ఎంత‌టి క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. డ‌బ్బు సంపాదించ‌లేక చాలా మంది ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అప్పులు చేస్తున్నారు. దీంతో అవి తీర్చ‌లేక మ‌రిన్ని ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. అయితే కొంద‌రు డ‌బ్బు సంపాదిస్తున్నారు. కానీ చేతిలో డ‌బ్బు నిల‌వ‌డం లేద‌ని వాపోతున్నారు. వ‌చ్చిన డ‌బ్బు వ‌చ్చిన‌ట్లే ఖర్చ‌వుతుంద‌ని విచారిస్తుంటారు. కానీ ఈ సమ‌స్య‌ల‌కు ఇంట్లో వాస్తు దోషం కూడా కార‌ణ‌మ‌వుతుంది. అలాగే ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం కూడా ఉండాలి. అది లేక‌పోయినా ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మ‌రి ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

సాధార‌ణంగా చాలా మంది ఇళ్ల‌లో వివిధ ర‌కాల పూల‌మొక్క‌ల‌ను పెంచుతుంటారు. వాటిల్లో స‌న్న‌జాజి మొక్క ఒక‌టి. చాలా మంది ఇళ్ల‌లో ఈ మొక్క ఒక్క‌టే ఉంటుంది. కానీ దీంతోపాటు విర‌జాజి అనే మొక్క కూడా ఉంటుంది. దీన్ని కూడా ఇంట్లో పెంచాలి. ఈ రెండు మొక్క‌ల‌నూ ల‌క్ష్మీ నారాయ‌ణుల స్వ‌రూపంగా భావిస్తారు. క‌నుక ఇంట్లో స‌న్న‌జాజి మొక్క‌ను పెంచుతున్న వారు దాంతోపాటు విర‌జాజి మొక్క‌ను కూడా పెంచాల్సి ఉంటుంది. దీంతో ల‌క్ష్మీ నారాయ‌ణుల అనుగ్ర‌హాన్ని పొంద‌వ‌చ్చు.

grow these 3 plants in home for wealth

ఇక పైన తెలిపిన రెండు మొక్క‌ల‌తోపాటు ఇంటి పెర‌ట్లో తుల‌సి మొక్క‌ను కూడా పెంచాలి. తుల‌సి సాక్షాత్తూ ల‌క్ష్మీ దేవి స్వ‌రూప‌మ‌ని చెబుతారు. క‌నుక స‌న్న‌జాజి, విర‌జాజి, తుల‌సి మొక్క‌ల‌ను ఇంట్లో పెంచ‌డం వ‌ల్ల ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం మ‌న‌కు క‌లుగుతుంది. దీంతో ఆర్థిక స‌మ‌స్య‌ల‌న్నీ పోతాయి. డ‌బ్బు బాగా సంపాదిస్తారు. వ‌ద్ద‌న్నా డ‌బ్బు వ‌స్తూనే ఉంటుంది.

ఇక ఈ మొక్క‌ల‌కు చెందిన పువ్వుల‌ను కోసి సాయంత్రం స‌మ‌యంలో మాల‌గా చేసి ల‌క్ష్మీ నారాయ‌ణుల చిత్ర‌ప‌టాలు లేదా విగ్ర‌హాల‌పై వేయాలి. త‌రువాత పూజ లేదా దీపారాధ‌న చేయాలి. క‌నీసం రెండు అగ‌రువ‌త్తుల‌ను అయినా వెలిగించాలి. ఇలా పూల‌ను మాల‌గా త‌యారు చేసి దాన్ని వేసి పూజ చేసే వ‌ర‌కు ఏదైనా ఒక కోరిక‌ను బ‌లంగా కోరుకుంటూ ఉండాలి. ఇలా రోజూ చేయ‌డం వ‌ల్ల ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం మ‌న‌పై క‌లుగుతుంది. దీంతో ఆర్థిక స‌మ‌స్య‌లు పోయి డ‌బ్బును బాగా సంపాదిస్తారు. ఇలా ధ‌నాన్ని పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts