food

మీల్ మేకర్ కట్లెట్ తయారీ విధానం

మీకు ఏదైనా కొత్తగా తయారు చేసుకొని తినాలి అనిపిస్తుందా.. అయితే మీల్ మేకర్ కట్లెట్ ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి తింటే మరీ మరీ ఈ రెసిపీ ట్రై చేస్తారు. మరి ఎంతో టేస్ట్ గా ఉండే మీల్ మేకర్ కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

మీల్ మేకర్ ఒక కప్పు (ఉడికించుకోవాలి), బంగాళదుంప ఒక కప్పు (ఉడకబెట్టి మెత్తని ముద్దలా తయారు చేసుకోవాలి), బ్రెడ్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు, పుదీనా తురుము టేబుల్ స్పూన్, కొత్తిమీర తురుము, గరం మసాలా అర టీ స్పూన్, 2పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్, జీలకర్ర పొడి అర టీ స్పూన్, కారం అర టీ స్పూన్, దాల్చినచెక్క పొడి చిటికెడు, ఏలకుల పొడి కొద్దిగా, ఉప్పు తగినంత, కార్న్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత.

how to make mealmaker cutlet recipe in telugu

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కి ముందుగా ఉడికించి పెట్టుకొన్న మీల్ మేకర్ తురుము, ముందుగా ఉడికించిన బంగాళదుంప, బ్రెడ్ పౌడర్, పైన చెప్పిన పదార్థాలన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటూ కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఈ లోగా స్టౌ పై కడాయిలో నూనె వేసి నూనె బాగా వేడి అయిన తరువాత ఈ మిశ్రమంతో చిన్నటి బాల్స్ లా తయారు చేసుకొని బాగా వేయించుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడు మీల్ మేకర్ కట్లెట్ టమోటో కెచప్ తో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Admin

Recent Posts