మన భారతీయ వంటకాలలో జిలేబికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నాయి అంటే తప్పకుండా జిలేబి ఉండాల్సిందే. కొంచెం పుల్లగా మరికొంచెం తీయగా కరకరలాడే ఈ జిలేబిని ఇంట్లోనే ఎంతో సులభంగా రుచికరంగా తయారుచేసుకోవచ్చు. మరి జిలేబి ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
మైదా పిండి ఒక కప్పు, శెనగపిండి 1 టేబుల్ స్పూన్, పెరుగు ఒక కప్పు, చక్కెర ఒక కప్పు, నీళ్లు 4 కప్పులు, నెయ్యి ఒక కప్పు, ఫ్రూట్ సాల్ట్ చిటికెడు.
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి మైదా పిండి, శనగ పిండి, ఒక కప్పు పెరుగు, ఫ్రూట్ సాల్ట్ వేసి ఎక్కడ ఉండలు లేకుండా మందపాటి మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పది నిమిషాల పాటు కదల్చకుండా పక్కన పెట్టుకోవాలి. ఈ సమయంలో పొయ్యి పై మరొకరు గిన్నె పెట్టి పంచదార వేసి పాకం తయారు చేసుకోవాలి. చక్కెర తీగపాకం ఏర్పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
పదినిమిషాల తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న జిలేబి మిశ్రమాన్ని ఒక క్లాత్ లో వేసుకుని, ఆ క్లాత్ కి చిన్నటి రంధ్రం చేయాలి. ఇప్పుడు పొయ్యి మీద బాగా వేడెక్కిన నూనెలోకి క్లాత్ సహాయంతో జిలేబి ఆకారంలో చుట్టలుగా చుడుతూ రావాలి. ఈ విధంగా జిలేబి చుట్టాలను ఎర్రగా అటూ ఇటూ కాల్చుకున్న తర్వాత తీసి మరొక ప్లేట్లో పెట్టుకోవాలి.ఈ జిలేబి చుట్టలపై ముందుగానే తయారు చేసుకున్న చక్కెర పాకం వేస్తే ఎంతో రుచి కరమైన జిలేబీలు తయారైనట్టే.