Bajra : చిరు ధాన్యాలను తినడం వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వీటిల్లో సజ్జలు కూడా ముఖ్యమైనవే. మన పూర్వ కాలంలో పెద్దలు వీటినే తినేవారు. అయితే సజ్జలను నేరుగా ఉడకబెట్టి తినలేకపోతుంటారు. కానీ కింద చెప్పిన విధంగా చేస్తే.. ఎవరైనా సరే సజ్జలను తిష్టంగా తింటారు. వీటితో స్వీట్‌ను తయారు చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉండడమే కాదు.. పోషకాలు, ఆరోగ్యం రెండూ లభిస్తాయి. సజ్జలతో స్వీట్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సజ్జలతో స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
సజ్జ పిండి – 250 గ్రాములు, శనగపిండి – 30 గ్రాములు, బెల్లం – 250 గ్రాములు, యాలకుల పొడి – 10 గ్రాములు, నూనె – వేయించడానికి సరిపడా, నెయ్యి – 5 గ్రాములు.
సజ్జలతో స్వీట్‌ను తయారు చేసే విధానం..
సజ్జ పిండి, శనగపిండి బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో నీరు పోసి గరిటె జారుగా కలపాలి. కడాయిలో నూనె పోసి కాగిన తరువాత కలిపిన పిండిని బూందీ చట్రంలో పోస్తూ బూందీని తయారు చేసుకోవాలి. విడిగా బెల్లాన్ని ఉండ పాకం రానిచ్చి అందులో యాలకుల పొడి, బూందీ వేసి కలపాలి. తరువాత ఒక ప్లేట్‌కు నెయ్యి రాసి ఆ బూందీని అచ్చులా పరిచి చల్లారిన తరువాత డబ్బాలో నిల్వ చేయాలి.
ఇలా తయారు చేసిన సజ్జల స్వీట్‌లో ప్రోటీన్లు 10.2 గ్రాములు, ఫైబర్ 0.99 గ్రాములు, కాల్షియం 62.0 మిల్లీగ్రాములు, ఐరన్ 5.1 మిల్లీగ్రాములు లభిస్తాయి. ఈ స్వీట్‌ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని తినడం వల్ల పోషకాలు, శక్తి, ఆరోగ్యం అన్నింటినీ పొందవచ్చు.