Apps : చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో గతంలో భారత్ ఆ దేశానికి చెందిన, ఆ దేశంతో సంబంధం ఉన్న మొత్తం 220కి పైగా యాప్‌లను నిషేధించింది. అయితే తాజాగా మరో 54 యాప్‌లను నిషేధిస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బ తీసే విధంగా ఉన్నాయంటూ.. సదరు యాప్‌లను భారత్ నిషేధించింది.
ఇక ప్రస్తుతం నిషేధించబడిన యాప్‌లలో ఫ్రీ ఫైర్, వివా వీడియో ఎడిటర్, ఓనిమోజీ ఎరినా వంటి ముఖ్యమైన యాప్స్ ఉన్నాయి. 2020 జూన్ నెలలో 59 యాప్‌లను నిషేధించిన భారత్ అదే ఏడాది సెప్టెంబర్‌లో ఏకంగా 118 యాప్‌లను నిషేధించింది. వాటిల్లో పబ్‌జి మొబైల్ కూడా ఉంది. ఇక అదే ఏడాది నవంబర్‌లో మరో 43 యాప్‌లను నిషేధించింది. దీంతో మొత్తం నిషేధించబడిన యాప్‌ల సంఖ్య దాదాపుగా 300కు చేరుఉంది.
భారత్ తాజాగా నిషేధించిన యాప్ ల వివరాలు ఇలా ఉన్నాయి..