వైద్య విజ్ఞానం

డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే నాలుకను చూపించమంటారు.. నాలుక చూసి డాక్టర్లు ఏం తెలుసుకుంటారు..?

హెల్త్ బాగొక హాస్పటల్ కి వెళ్లినప్పుడు డాక్టర్లు నోరు తెరవమని, నాలుక బైటికి తీయమని చెప్తుంటారు. కొద్దిసేపు పరిశీలిస్తారు.కానీ జ్వరం, తలనొప్పి, విరేచనాలు ఇలా ఏ ప్రాబ్లంతో వెళ్లినా కూడా నాలుకనే ఎందుకు చెక్ చేస్తారు అని ఎప్పుడైనా డౌటొచ్చిందా. నాలుకను పరిశీలించడం వలన నాలుక యొక్క లక్షణాలను బట్టి మన ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుస్తాయి. వాటిల్లో కొన్ని.. నాలుకపై తెల్ల మచ్చలు, నల్లమచ్చలుండడాన్ని ఎప్పుడైనా గమనించారా. ఈ తెల్ల మచ్చలకు కారణం ఫంగస్. ఫంగస్ ఇన్ఫెక్షన్ల కారణంగానే ఈ మచ్చలు ఏర్పడతాయి. నాలుక ఎర్రబారి మెరవడం, అదే సమయంలో ఒంటి రంగు పాలిపోయి ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం.. ఇవన్నీ ఐరన్‌ లోపం, రక్తహీనత ఉన్నాయని చెప్పే లక్షణాలు.

కొందరి నాలుక మీద వెంట్రుకలు మొలిచినట్లుగా నల్లగా కనిపిస్తుంది. విపరీతంగా పొగతాగడం వల్ల లేదంటే శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌ వాడటం వల్ల వచ్చే ఫంగస్‌ కారణమై ఉంటుంది. నాలుక వాపు అనేది ఒక లక్షణం. నాలుక వాచినప్పుడు తినడానికి, మాట్లాడానికి ఇబ్బందిగా ఉంటుంది. నాలుక వాయడంతో పాటు ఒక్కోసారి రంగు కూడా మారుతుంది. శరీరంలో ఇన్‌ఫెక్షన్లు బాగా పెరిగిపోయినప్పుడు కనిపించే లక్షణం. నాలుక రంగు మారడం అన్నది కొందరిలో కామెర్లు, రక్తహీనత లేదా శరీరానికి సరిపడా ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల కూడా కావచ్చు. నాలుక ఒక పక్కకు వాలిపోతే అది పక్షవాత లక్షణంగా పరిగణిస్తారు. నాలుక వణకడం కనిపిస్తే అది థైరాయిడ్‌ గ్రంధి అతిగా పనిచేయడం కారణంగా ఉంటుంది. లేదా కొన్ని రకాల నరాల వ్యాధుల వల్ల గానీ, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ సమస్య వల్ల గానీ కావచ్చు. ఇప్పుడర్ధమయిందా డాక్టర్ దగ్గరకు వెళ్లగానే ఎందుకు నాలుకను పరీక్షిస్తారో.

why doctors see tongue when we visit them

అయితే ఆరోగ్యమైన, పరిశుభ్రమైన నాలుక వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఫ్రెష్ నెస్ ఇంప్రూవ్ చేయడం నుంచి.. శ్వాస అందించడం వరకు.. అనేక లాభాలున్నాయి. నాలుకను క్లీన్ చేయడం వల్ల పొందే లాభాలేంటో ఒక సారి చూద్దాం. నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల్లో మొదటికి రుచి పెరుగుతుంది.ఏది తిన్నా కారం, ఉప్పు, పులుపు, తీపి వంటి రకరకాల రుచులను తెలిపుతుంది నాలుక. సగటున ప్రతి ఒక్కరికి 10 వేల టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఇవి ప్రతి రెండు వారాలకు రీప్లేస్ అవుతూ ఉంటాయి. ఒకవేళ నాలుకను సరిగ్గా శుభ్రపరచకపోతే.. టేస్ట్ బడ్స్ బ్లాక్ అయిపోతాయి. దీనివల్ల టేస్ట్ తెలియక ఆహారంలో ఎక్కువ మోతాదులో ఉప్పుని, చక్కెరను కలుపుకుని తింటారు. రెండొవది దుర్వాసనను పోగొడుతుంది. రోజుకి రెండుసార్లు బ్రెష్ చేయడం వల్ల బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది.

రోజూ నాలుకను శుభ్రం చేసుకోవడం, నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. పలు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది. నాలుకను శుభ్రం చేసుకోకపోతే. బ్యాక్టీరియా పెరిగిపోయి చిగుళ్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కాబట్టి రెగ్యులర్ గా నాలుకను శుభ్రం చేసుకుంటే చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. బ్రషింగ్ పళ్లలో చిక్కుకున్న ఆహారాన్ని, బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మొత్తం నోటినంతా అంటే.. నాలుకను కూడా శుభ్రం చేసుకోవడం వల్ల.. వయసు పెరిగినా పళ్లు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

Admin

Recent Posts