Meera Jasmine : ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్న చాలా మంది హీరోయిన్లు అందాల ప్రదర్శన చేస్తున్నారు. గ్లామర్ షో చేయనిదే అవకాశాలు రావడం లేదని భావించిన వారు ఆ విధంగా ముందుకు కొనసాగుతున్నారు. అయితే ఒకప్పుడు సినిమాల్లో సంప్రదాయ పద్ధతిలో కనిపించిన కొందరు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అందాలను ఆరబోస్తున్నారు. అలాంటి వారిలో మీరా జాస్మిన్ ఒకరు.
మీరా జాస్మిన్ అప్పట్లో స్కిన్ షో చేయలేదు. అయినప్పటికీ ఆమెకు పలు వరుస సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. వాటిల్లో ఆమెకు కొన్ని సినిమాలు హిట్‌లను ఇచ్చాయి. అయితే ఈమె ఆ తరువాత కనుమరుగైపోయింది. ఇదిగో.. మళ్లీ ఇప్పుడే యాక్టివ్ అయింది. ఈ మధ్య కాలంలో మీరా జాస్మిన్ గ్లామర్ షో చేస్తూ అలరిస్తోంది.
ఇటీవలే నలుపు రంగు దుస్తుల్లో మెరిసిన మీరా జాస్మిన్ మళ్లీ లేటెస్ట్ ఫొటోషూట్‌తో ముందుకొచ్చింది. ఆమె తాజాగా చేసిన ఫొటోషూట్ తాలూకు ఫొటోలు మతులను పోగొడుతున్నాయి. అప్పట్లో ఎంత సంప్రదాయబద్దంగా ఉండేదో.. ఇప్పుడు అందుకు అంత వ్యతిరేకంగా అందాలను ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే తాజా ఆమె లైట్ పర్పుల్ కలర్ డ్రెస్ ధరించి ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది.
మీరా జాస్మిన్ షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో మీరా జాస్మిన్ గ్లామర్ షో చేస్తుండడంతో.. అందరూ ఆమెను చూసి అవాక్కవుతున్నారు. ఈమె ఇంతలా ఎందుకు రెచ్చిపోతోంది, ఏదైనా సినిమాలో అవకాశం కోసం ప్రయత్నిస్తుందా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.