Instant Rasam : ఇన్ స్టాంట్ రసం.. మనకు మార్కెట్ లో లభించే రసం పొడితో చేసే ఈ ఇన్ స్టాంట్ రసం చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంతో ఈరసాన్ని తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని 10నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు, జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేటప్పుడు ఈ రసాన్ని చేసి తీసుకోవడం వల్ల ఎంతో హాయిగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ ఇన్ స్టాంట్ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, టమాట – 1, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెమ్మలు – 3, ఎండుమిర్చి – 2, పచ్చిమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – చిటికెడు, పసుపు – పావు టీ స్పూన్, రసం పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఇన్ స్టాంట్ రసం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నానబెట్టిన చింతపండు, టమాట వేసి చేత్తో బాగా నలపాలి. తరువాత పిప్పి తీసేసి రసాన్ని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తరువాత పసుపు, రసం పొడి వేసి కలపాలి. తరువాత ముందుగా సిద్దం చేసుకున్న చింతపండు రసం, ఉప్పు వేసి కలపాలి. తరువాత పులుపుకు తగినన్ని నీళ్లు పోసి కలపాలి. దీనిని ఒక పొంగు వచ్చే వరకు మరిగించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రసం తయారవుతుంది. దీనిని వేడి వేడిగా అన్నంతో తింటే మరింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన రసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.