Top 9 Selenium Rich Foods : మన శరీరానికి అవసరమైన పోషకాల్లో సెలీనియం కూడా ఒకటి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాగే కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో, శరీరంలో మంటను తగ్గించి శరీరాన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడడంలో ఇది మనకు సహాయపడుతుంది. కనుక మనం సెలీనియం ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకోవాలి. ఇప్పుడు చెప్పే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనం మన శరీరానికి తగినంత సెలీనియం అందేలా చూసుకోవచ్చు. సెలీనియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎంతో రుచిగా ఉండే పొద్దు తిరుగుడు గింజలల్లో సెలీనియం ఎక్కువగా ఉంటుంది.
వీటిని నేరుగా స్నాక్స్ గా తీసుకోవచ్చు లేదా సలాడ్స్, పెరుగు వంటి వాటితో కలిపి తీసుకోవచ్చు. అలాగే పొద్దు తిరుగుడు గింజలను తీసుకోవడం వల్ల సెలీనియంతో పాటు విటమిన్ ఇ, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా లభిస్తాయి. సెలీనియం ఎక్కువగా ఉండే వాటిల్లో బ్రెజిల్ గింజలు కూడా ఒకటి. ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే దాని కంటే ఎక్కువ సెలీనియం లభిస్తుంది. బ్రెజిల్ గింజలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. గుడ్డులో కూడా సెలీనియం ఉంటుంది. ఆహారంలో గుడ్డును తీసుకోవడం వల్ల సెలీనియంతో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి.
శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పుట్టగొడుగుల్లో కూడా సెలీనియం ఎక్కువగా ఉంటుంది. స్టైర్ ఫ్రైస్, ఆమ్లెట్ వంటి వాటిలో పుట్టగొడుగులను చేర్చుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అలాగే ట్యూనా, హాలిబట్, సాల్మన్ వంటి కొన్ని రకాల చేపలల్లో కూడా సెలీనియం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల సెలీనియంతో పాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా శరీరానికి అందుతాయి. శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అదే విధంగా రొయ్యలు, పీతలు వంటి వాటిలో కూడా సెలీనియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల సెలీనియంతో పాటు ప్రోటీన్, జింక్, విటమిన్ బి12 వంటి పోషకాలు కూడా లభిస్తాయి.
చికెన్ లో కూడా సెలీనియం ఉంటుంది. చికెన్ ను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. అదే విధంగా బ్రౌన్ రైస్, క్వినోవా, బార్లీ వంటి ధాన్యాల్లో కూడా సెలీనియం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరం మొత్తం ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఈవిధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినంత సెలీనియం లభిస్తుంది. అలాగే శరీరానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఈ ఆహారాలను ప్రతి ఒక్కరు వారి రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకునే ప్రయత్నం చేయాలి.