Karam Jonna Rottelu : జొన్న రొట్టెల‌ను ఇలా కార కారంగా చేస్తే.. ఇష్టం లేని వారు కూడా తింటారు..!

Karam Jonna Rottelu : జొన్న‌రొట్టెల‌ను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. జొన్న రొట్టెల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు, బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు దీనిని తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. త‌ర‌చూ ఒకే ర‌కం జొన్న రొట్టెలు కాకుండా వీటిలో కారం వేసి మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేసే ఈ కారం జొన్న రొట్టెలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ కారం జొన్న రొట్టెల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కారం జొన్న రొట్టెల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చిమిర్చి – 10 నుండి 15, ఉప్పు – త‌గినంత‌, జొన్న‌పిండి – 3 క‌ప్పులు, జీల‌కర్ర -ఒక టీ స్పూన్.

Karam Jonna Rottelu recipe in telugu very tasty and healthy
Karam Jonna Rottelu

కారం జొన్న రొట్టెల త‌యారీ విధానం..

ముందుగా జార్ లో ప‌చ్చిమిర్చి, ఉప్పు వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో జొన్న‌పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చిమిర్చి, జీల‌క‌ర్ర వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు పిండిని నాన‌బెట్టాలి. త‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి.

పెనం వేడ‌య్యే లోపు త‌గినంత పిండిని తీసుకుని పాలిథిన్ క‌వ‌ర్ పై ఉంచి చేత్తో రొట్టెలాగా వ‌త్తుకోవాలి. త‌రువాత ఈ రొట్టెను పెనం మీద వేసి కాల్చుకోవాలి. దీనిని మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా చ‌క్క‌గా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కారం జొన్న రొట్టె తయార‌వుతుంది. దీనిని నేరుగా ఇలాగే తిన‌వ‌చ్చు లేదా కూర‌తో తిన‌వ‌చ్చు. ఎలా తిన్నా కూడా ఈ జొన్న రొట్టె చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా కారం జొన్న రొట్టెను త‌యారు చేసుకుని రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts