Aloe Vera For Eye Sight : ప్రస్తుత కాలంతో మనలో చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. కంటి చూపు తగ్గడం, కళ్లు మసకగా కనిపించడం, కంటిలో శుక్లాలు ఇలా వివిధ రకాల కంటి సమస్యలతో బాధపడుతున్నారు. వయసు పైబడే కొద్ది వచ్చే ఈ కంటి సమస్యలు నేటి కాలంలో పిల్లల్లో కూడా వస్తున్నాయి. పోషకాహార లోపం, టీవీ, సెల్ ఫోన్, ల్యాప్ టాప్ వంటి వాటిని ఎక్కువగా ఉపయోగించడం వంటి వివిధ కారణాల చేత మనం కంటి సమస్యల బారిన పడాల్సి వస్తుంది. చాలా మంది కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి కళ్లద్దాలను వాడుతూ ఉంటారు. అద్దాలు వాడే అవసరం లేకుండా మనకు సులభంగా లభించే పదార్థాలతో స్మూతీని తయారు చేసుకుని తాగడం వల్ల మనం మన కంటి చూపును చాలా సులభంగా మెరుగుపరుచుకోవచ్చు.
ఈ స్మూతీని తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడడంతో పాటు శరీరానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. కంటిచూపును మెరుగుపరిచి కంటి సమస్యలను తొలగించే ఈ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్మూతీని తయారు చేసుకోవడానికి గానూ మనం అర కప్పు కలబంద గుజ్జును, అర కప్పు తరిగిన వాల్ నట్స్ ను, ఒక టేబుల్ స్పూన్ తేనెను, రెండు నిమ్మకాయల రసాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో కలబంద గుజ్జును వేసి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత నీటిని వడకట్టి కలబంద గుజ్జును 10 నుండి 12 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. ఇలా ఫ్రిజ్ లో ఉంచిన కలబంద గుజ్జును జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పైన చెప్పిన మిగిలిన పదార్థాలన్నింటిని వేసి స్మూతీలా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి.
తరువాత ఈ స్మూతీని మూడు భాగాలుగా చేసి పూటకు ఒక భాగం చొప్పున తాగాలి. ఈ స్మూతీని మూడు పూటలా ఆహారం తీసుకోవడానికి అరగంట ముందు తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. ఈ స్మూతీ తయారీలో ఉపయోగించిన ప్రతి పదార్థం కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేదే. వీటిలో ఉండే పోషకాలు కంటి సమస్యలను తగ్గించడంలో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఈ విధంగా కంటి చూపు తగ్గడం, మక్యులర్ డీ జెనరేషన్, కంటిలో శుక్లాలు వంటి సమస్యలతో బాధపడే వారు ఈ విధంగా స్మూతీని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.