Meal Maker Curry : మీల్ మేక‌ర్‌ల‌తో ఇలా కూర చేస్తే చికెన్‌, మ‌ట‌న్ కూడా ప‌నిచేయ‌వు.. అంత టేస్టీగా ఉంటుంది..!

Meal Maker Curry : మీల్ మేక‌ర్ ల‌ను కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటాము. మీల్ మేక‌ర్ లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో కూర‌ల‌ను వండుకుని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. మీల్ మేక‌ర్ ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా చేసే మీల్ మేక‌ర్ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. నాన్ వెజ్ వంట‌కాల‌కు ఏమాత్రం తీసి పోకుండా ఉంటుంది ఈ కర్రీ. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే ఈ మీల్ మేక‌ర్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మీల్ మేక‌ర్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మీల్ మేక‌ర్ – ఒక క‌ప్పు, త‌రిగిన ట‌మాట – 1, నూనె – 3 టేబుల్ స్పూన్స్, పొడ‌వుగా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు -ముప్పావు క‌ప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీస్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Meal Maker Curry recipe if you make like this very tasty
Meal Maker Curry

మ‌సాలా పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క‌, స్టోన్ ప్ల‌వ‌ర్ – కొద్దిగా, ల‌వంగాలు – 4, యాల‌కులు – 3, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, ఎండుకొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు ప‌లుకులు – 6, సోంపు గింజ‌లు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్.

మీల్ మేక‌ర్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక మీల్ మేక‌ర్ వేసి 3 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత నీటిని పార‌బోసి చ‌ల్ల‌టి నీటిని పోసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత మీల్ మేక‌ర్ ల‌ను నీరంతా పోయేలా చేత్తో గ‌ట్టిగా పిండి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో మ‌సాలా పొడికి కావ‌ల్సిన ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పొడిగా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని ఎర్ర‌గా వేయించిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ట‌మాటాను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, ఉప్పు వేసి క‌లపాలి. త‌రువాత మీల్ మేక‌ర్ వేసి క‌ల‌పాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి 4 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత మ‌సాలా పొడి వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి మూత పెట్టి మీల్ మేక‌ర్ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. మీల్ మేక‌ర్ ఉడికి నూనె పైకి తేలిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేక‌ర్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో తింటే మ‌రింత రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts