Skin Issues : గ‌జ్జి, తామ‌ర‌, దుర‌ద 2 నిమిషాల్లో మాయ‌మ‌వుతుంది.. మ‌ళ్లీ రాదు.. ఇలా చేయండి..!

Skin Issues : మ‌న‌లో కొంత మందికి శ‌రీరం లావుగా ఉండ‌డం వ‌ల్ల‌, చెమ‌టలు ఎక్కువ‌గా ప‌ట్ట‌డం వ‌ల్ల బ‌ట్ట‌లు ఎక్కువ‌గా రాపిడికి గురి అవుతాయి. ఇలా చెమ‌టలు నిల్వ ఉండే భాగాల్లో బ‌ట్ట‌లు రాపిడికి గురి అవ్వ‌డం వ‌ల్ల చ‌ర్మం దెబ్బ‌తింటుంది. దీనికి తోడు గాలిలో ఉండే ఫంగ‌స్ క్రిములు చ‌ర్మంపై చేరి తామ‌ర‌కు దారి తీస్తాయి. తామ‌ర అంటువ్యాధి. ఇది ఒక‌రి నుండి మ‌రొక‌రికి వ‌చ్చే అవ‌కాశం ఉంది. మందులు వాడ‌డం వ‌ల్ల కొంద‌రిలో వెంట‌నే ఉప‌శ‌మ‌నం ఉంటుంది. ఇది కొన్నిసార్లు వెంట‌నే త‌గ్గిన‌ప్ప‌టికి మ‌ర‌లా వ‌స్తూనే ఉంటుంది. చ‌ర్మ స‌మ‌స్య అయిన‌టువంటి తామ‌ర‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉన్నారు. ఈ తామ‌ర స‌మ‌స్య మ‌ర‌లా మ‌ర‌లా రాకుండా ఉండాలనుకునే వారు స‌హ‌జ సిద్దంగా ల‌భించే సిట్రోడ‌రా ఆయిల్ ను వాడ‌డం మంచిది.

సిట్రోడ‌రా ఆయిల్ లో బ‌యో ఆక్టివ్ కెమిక‌ల్స్, సిఎమ్ డి అనే రెండు ర‌కాల ర‌సాయ‌న స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి చాలా శ‌క్తివంత‌మైన యాంటీ ఫంగ‌ల్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటాయి. తామ‌ర ఉన్న చోట్ చ‌ర్మంపై ఈ నూనెను రాయ‌డం వ‌ల్ల ఫంగ‌స్ క్రిములు పూర్తిగా న‌శిస్తాయి. చ‌ర్మంపై ఉండే పెచ్చులు ఊడిపోతాయి. దుర‌ద కూడా త‌గ్గుతుంది. ఈ నూనె మ‌న‌కు ఆన్ లైన్ లో సుల‌భంగా ల‌భిస్తుంది. తామ‌ర స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ నూనెను వాడ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. తామ‌ర స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ నూనెను ఎలా వాడాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో 4 టీ స్పూన్ల సిట్రోడ‌రా ఆయిల్ ను తీసుకోవాలి. దీనిలో 50 ఎమ్ ఎల్ కొబ్బ‌రి నూనెను వేసి బాగా క‌లిపి ఉంచుకోవాలి. రోజూ రెండు పూట‌లా ఈ నూనెను తామ‌ర‌పై రాసుకోవాలి.

Skin Issues home remedies in telugu follow these for relief
Skin Issues

ఇలా చేయ‌డం వ‌ల్ల 20 నుండి 25 రోజుల్లోనే తామ‌ర పూర్తిగా త‌గ్గుతుంది. తామ‌ర మ‌చ్చ‌లు కూడా తొల‌గిపోతాయి. దుర‌ద, మంట నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అలాగే ఈ స‌మ‌స్య మ‌ర‌లా రాకుండా ఉంటుంది. అలాగే కొంద‌రిలో గోర్ల ద‌గ్గ‌ర ఫంగ‌స్ క్రిములు చేరి ఆ భాగం ఉబ్బిన‌ట్టుగా ఉంటుంది. అలాంటి వారు గోర్ల‌ను ఈ నూనెలో ముంచ‌డం లేదా నూనెను రాయ‌డం వంటివి చేయ‌డం వ‌ల్ల ఇన్పెక్ష‌న్ తగ్గుతుంది. ఈ విధంగా సిట్రోడ‌రా ఆయిల్ ను వాడడం వ‌ల్ల తామ‌ర వంటి ఇన్పెక్ష‌న్ స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా చాలా త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts