Salt : మనం రోజూ చేసే వంటల్లో ఉప్పును వేస్తుంటాం. ఉప్పు లేకుండా అసలు ఏ వంటకం పూర్తి కాదు. ఉప్పు వల్ల కూరలకు రుచి వస్తుంది. అయితే ఉప్పును కేవలం వంటలకే కాదు.. పలు ఇతర పనులకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఉప్పును ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కిచెన్‌లో స్టవ్‌ను ఉంచే బండ చాలా మురికిగా మారుతుంది. అలాటంప్పుడు ఉప్పు, సర్ఫ్ చల్లి కాసేపటి తరువాత నీళ్లతో శుభ్రం చేయాలి. దీంతో వాసన, మరకలు పోతాయి.
2. చీమలు బాగా ఇబ్బందులకు గురి చేస్తుంటే.. అవి ఉండే స్థావరాలతోపాటు అవి వెళ్లే మార్గంలో ఉప్పు చల్లాలి. దీంతో చీమలు రాకుండా ఉంటాయి.
3. వేపుడు వంటి కూరలు చేసినప్పుడు పాత్రలు నల్లగా మాడుతుంటాయి. కానీ ఉప్పు వేసి తోమితే మాడు పోతుంది. పాత్రలు తళతళా మెరుస్తాయి.
4. వెల్లుల్లి పొట్టు తీస్తే చేతులు మంటగా అనిపించడంతోపాటు వాసన వస్తాయి. అలాంటప్పుడు ఉప్పు, నిమ్మరసం మిశ్రమంతో చేతులు కడగాలి. తరువాత నీటితో శుభ్రం చేయాలి. దీంతో మంట, వాసన పోతాయి.
5. దుస్తులపై ఉండే తుప్పు మరకలను వదిలించుకునేందుకు కూడా ఉప్పు బాగా పనిచేస్తుంది. అలాగే ఓవెన్‌లో కాస్త ఉప్పు చల్లి కొంత సేపటి తరువాత తుడిస్తే వాసన పోతుంది.
6. పాదాలు బాగా నొప్పిగా ఉంటే.. ఒక బకెట్ తీసుకుని అందులో పాదాలు మునిగేంత వరకు నీళ్లను పోయాలి. అందులో కాస్త ఉప్పు, బేకింగ్ సోడా వేసి కలపాలి. తరువాత అందులో పాదాలను 15 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో పాదాల నొప్పులు తగ్గుతాయి.
7. టీ పోసే ఫ్లాస్క్‌లు వాడుతున్న కొద్దీ వాసన వస్తుంటాయి. అలాంటప్పుడు అందులో కాస్త ఉప్పు వేసి గోరు వెచ్చని నీళ్లను పోయాలి. తరువాత మూత పెట్టి బాగా షేక్ చేయాలి. తరువాత సాధారణ నీళ్లతో కడిగేయాలి. దీంతో వాసన పోతుంది.