Cloves : ల‌వంగాల‌ను ఈ స‌మ‌యంలో తింటే అద్భుతాలు జరుగుతాయి.. ముఖ్యంగా పురుషులు..!

Cloves : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ల‌వంగాల‌ను ఉప‌యోగిస్తున్నారు. ఇది ఎంతో కాలం నుంచి మ‌న‌కు వంట ఇంటి మ‌సాలా దినుసుగా ఉంది. అయితే ల‌వంగాలు ఘాటుగా ఉంటాయి. క‌నుక వీటిని తినేందుకు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. కానీ ఘాటుగా ఉన్నా స‌రే వీటిని రోజూ తినాల్సిందే. వీటి వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

take Cloves at this time for wonderful benefits
Cloves

ల‌వంగాల‌లో అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. క‌నుక ఇవి మ‌న‌కు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డతాయి. ల‌వంగాల్లో విట‌మిన్లు బి1, బి2, బి4, బి6, బి9, విట‌మిన్ సి అధికంగా ఉంటాయి. క‌నుక వీటిని పోష‌కాల‌కు గ‌నిగా చెప్ప‌వ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల బి కాంప్లెక్స్ విట‌మిన్లు మ‌న‌కు దాదాపుగా అన్నీ ల‌భిస్తాయి. ఇవి మ‌న‌ల్ని అనేక వ్యాధుల నుంచి ర‌క్షిస్తాయి. ల‌వంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీర రోగ‌నిరోధక శ‌క్తిని పెంచుతాయి. సీజ‌న‌ల్ గా వ‌చ్చే వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్షిస్తాయి.

ల‌వంగాల‌ను పురుషులు క‌చ్చితంగా రోజుకు 2 తీసుకోవాలి. ఎందుకంటే ఇవి పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచుతాయి. ల‌వంగాల్లో ఉండే ఐర‌న్‌, కాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్‌, పొటాషియం, జింక్ త‌దిత‌ర మిన‌ర‌ల్స్ ఎంత‌గానో మేలు చేస్తాయి. ఇవి పురుషుల్లో ఉండే స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. దీంతో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. వీర్యం అధికంగా ఉత్ప‌త్తి అవుతుంది. దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి.

ల‌వంగాల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. గ్యాస్‌, అజీర్ణం త‌గ్గుతాయి. పొట్ట‌లో ఉండే సూక్ష్మ క్రిములు న‌శిస్తాయి. మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. ల‌వంగాల్లోని కాల్షియం ఎముక‌ల‌ను దృఢంగా మారుస్తుంది.

ల‌వంగాల‌ను తిన‌డం వల్ల మ‌న‌కు పూర్తి స్థాయిలో ఫ‌లితాలు రావాలంటే.. వాటిని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తినాల‌ని.. ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. ప‌ర‌గ‌డుపునే 2 ల‌వంగాల‌ను తిన‌డం వ‌ల్ల పైన తెలిపిన ప్ర‌యోజ‌నాల‌న్నీ క‌లుగుతాయ‌ని అంటున్నారు. క‌నుక వాటిని ప‌ర‌గ‌డుపున తింటేనే మ‌న‌కు మేలు జ‌రుగుతుంది. అయితే ల‌వంగాల‌ను 2 క‌న్నా ఎక్కువ తీసుకోరాదు. తింటే క‌డుపులో మంట‌, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక రోజుకు 2 ల‌వంగాల‌ను మాత్ర‌మే తినాల్సి ఉంటుంది.

Admin

Recent Posts