Radish Chapati : ముల్లంగి తిన‌లేరా..? వాటితో చ‌పాతీలు చేసి తినండి.. బాగుంటాయి..!

Radish Chapati : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక కూర‌గాయ‌ల్లో ముల్లంగి ఒక‌టి. ఇది ఘాటైన రుచి, వాస‌న‌ల‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక దీన్ని తినేందుకు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. వాస్త‌వానికి దుంప కూర‌లన్నింటిలోనూ ముల్లంగి ఎంతో మేలైంది. అందువ‌ల్ల ముల్లంగిని త‌ప్ప‌నిసరిగా తీసుకోవాలి. అయితే దీన్ని నేరుగా తిన‌లేని వారు.. దీంతో చ‌పాతీల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా మ‌న‌కు ముల్లంగి వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇక ముల్లంగితో చపాతీల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Radish Chapati very easy to make healthy option
Radish Chapati

ముల్లంగి చ‌పాతీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గోధుమ పిండి – రెండు క‌ప్పులు, ముల్లంగి తురుము – ఒక క‌ప్పు, జీల‌క‌ర్ర – అర టీస్పూన్‌, కారం – టీస్పూన్‌, అల్లం వెల్లుల్లి ముద్ద – అర టీస్పూన్‌, ఉప్పు, నీళ్లు, నూనె, నెయ్యి – త‌గినంత‌.

ముల్లంగి చ‌పాతీ త‌యారు చేసే విధానం..

ఒక గిన్నెలో గోధుమ పిండి, ముల్లంగి తురుము, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద‌, జీల‌క‌ర్ర వేసి పిండిని క‌ల‌పాలి. స‌హ‌జంగానే ముల్లంగిలో నీరు ఉంటుంది కాబ‌ట్టి కాస్తంత నీళ్లు పోస్తే చాలు. చివ‌రిగా కొద్దిగా నూనె పోసి బాగా క‌లిపి పావు గంట పాటు ప‌క్క‌న పెట్టుకోవాలి. ఆ త‌రువాత చ‌పాతీల్లా చేసుకుని పెనంపై వేసి రెండు వైపులా నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి. దీంతో ఘుమ ఘుమ‌లాడే రుచిక‌ర‌మైన ముల్లంగి చ‌పాతీలు రెడీ అవుతాయి. వీటిని నేరుగా తిన‌వ‌చ్చు. లేదా ఏదైనా ప‌చ్చ‌డి, కూర వంటి వాటితో క‌లిపి కూడా తిన‌వ‌చ్చు. దీంతో రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండూ ల‌భిస్తాయి.

Share
Admin

Recent Posts