Onion With Toothpaste : ఉల్లిపాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిని ఉపయోగించడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అలాగే ఉల్లిపాయలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. బ్యాక్టీరియా, వైరస్ లను వృద్ధి చెందకుండా చేసి వాటిని నశింపజేయడంలో ఉల్లిపాయలు చక్కగా పని చేస్తాయి. ఉల్లిపాయలను వంటల్లో వాడడంతో పాటు వీటిని ఉపయోగించి మనం ఇంట్లో ఉండే క్రిమి కీటకాలను, వైరస్, బ్యాక్టీరియాలను కూడా నశింపజేయవచ్చు. అలాగే ఈ ఉల్లిపాయను ఉపయోగించి మొక్కలకు వచ్చే తెగుల్లను కూడా నివారించుకోవచ్చు.
ఉల్లిపాయతో ఒక ద్రవాన్ని తయారు చేసుకుని ఉపయోగించడం వల్ల ఈ ప్రయోజనాలన్నింటిని మనం పొందవచ్చు. ఉల్లిపాయతో మనకు అనేక విధాలుగా పనికి వచ్చే ఈ ద్రవాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ద్రవాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం ఉల్లిపాయను, తెల్లగా ఉండే టూత్ పేస్ట్ ను, ఒక గ్లాస్ నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఉల్లిపాయపై ఉండే తొక్కను తీసేసి ముక్కలుగా చేసి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ మోతాదులో టూత్ పేస్ట్ ను వేసి బాగా కలపాలి. తరువాత ఈ గిన్నెపై మూతను ఉంచి అర గంట పాటు అలాగే ఉంచాలి. అరగంట తరువాత ఈ నీటిని వడకట్టి ఒక స్ప్రే బాటిల్ లోకి తీసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న ద్రవాన్ని మొక్కలపై పిచికారి చేయాలి. ఇలా చేయడం వల్ల మొక్కలకు పురుగులు పట్టకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి. రసాయనాలు కలిగిన క్రిమి సంహారాలను ఉపయోగించడానికి బదులుగా ఈ ఉల్లిపాయతో ద్రవాన్ని చేసుకుని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ ద్రవాన్ని స్టీల్ ట్యాప్ లపై పిచికారి చేసి పావు గంట పాటు అలాగే ఉంచాలి. తరువాత స్క్రబర్ తో ట్యాప్ లను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ట్యాప్ లు చక్కగా శుభ్రపడతాయి. అలాగే వాటిపై ఉండే బ్యాక్టీరియా, క్రిములు అన్ని కూడా నశిస్తాయి. కేవలం స్టీల్ ట్యాప్ లే కాకుండా స్టీల్ స్టవ్స్, ఇతర స్టీల్ వస్తువులను కూడా మనం ఈ ద్రవంతో శుభ్రం చేసుకోవచ్చు. అదే విధంగా ఈ ద్రవాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దానిపై ప్లాస్టిక్ కవర్ ను ఉంచి ఊడిపోకుండా గట్టిగా కట్టాలి.
తరువాత ఆ కవర్ కు టూత్ పిక్ తో చిన్న చిన్న రంధ్రాలు చేయాలి. ఇప్పుడు ఈ గిన్నెను ఒక రోజంతా ఫ్రిజ్ లో ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఫ్రిజ్ లో ఉండే దుర్వాసన పోయి ఫ్రిజ్ చక్కటి వాసన వస్తుంది. అంతేకాకుండా ఫ్రిజ్ లో ఉండే బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. అంతేకాకుండా ఉల్లిపాయతో ఈ విధంగా తయారు చేసుకున్న ద్రవాన్ని ఇంట్లో క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయనుకున్న ప్రదేశంలో చల్లాలి. ఇలా చేయడం వల్ల క్రిములు, వైరస్, బ్యాక్టీరియాలు నశిస్తాయి. దీంతో మనం చాలా వరకు వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. ఈ విధంగా ఉల్లిపాయతో ద్రవాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు.