Palak Egg Fry : పాల‌కూర, కోడిగుడ్లు క‌లిపి ఒక్క‌సారి ఇలా వండండి.. రుచి చూస్తే జ‌న్మ‌లో మ‌రిచిపోరు..

Palak Egg Fry : మ‌నం పాల‌కూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాల‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అయితే మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మాత్రం ఈ పాల‌కూర‌ను త‌క్కువ‌గా తీసుకోవాలి. పాల‌కూర‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌కూర‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. పాల‌కూర‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు కింద చెప్పిన విధంగా చేసే కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా దీనిని చాలా స‌లుభంగా తయారు చేసుకోవ‌చ్చు. పాల‌కూర‌లో కోడిగుడ్ల‌ను వేసి రుచిగా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాల‌కూర ఎగ్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న‌గా త‌రిగిన పాల‌కూర – 5 క‌ట్టలు, కోడిగుడ్లు – 2, నూనె – 4 టేబుల్ స్పూన్స్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 3, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 5, స‌న్న‌గా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1 ( పెద్ద‌ది), క‌రివేపాకు – ఒక రెమ్మ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్.

Palak Egg Fry recipe in telugu very easy to make tasty
Palak Egg Fry

పాల‌కూర ఎగ్ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా కోడిగుడ్ల‌ను ఒక గిన్నెలోకి తీసుకుని బాగా క‌లిపి ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక వెల్లుల్లి రెబ్బ‌లు, ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి ముక్క‌లు, ఉల్లిపాయ ముక్కలు, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ప‌సుపు వేసి వేయించాలి. త‌రువాత త‌రిగిన పాల‌కూర, త‌గినంత ఉప్పు వేసి క‌ల‌పాలి. ఈ పాల‌కూర‌ను పూర్తిగా ఉడికి ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు క‌లుపుతూ ఉడికించాలి. పాల‌కూర ద‌గ్గర ప‌డిన త‌రువాత ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత కోడిగుడ్డు మిశ్రమం వేసి క‌దిలించ‌కుండా అలాగే ఉంచాలి. కోడిగుడ్డు కొద్దిగా ఉడికిన త‌రువాత అంతా క‌లిసేలా బాగా క‌ల‌పాలి.

దీనిని మ‌రో మూడు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌కూర ఎగ్ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పాల‌కూర‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా వండుకుని తిన‌వ‌చ్చు. ఈ కూర‌ను చాలా బాగుంది అంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts