Palli Biscuits : చుక్క నూనె, నెయ్యి లేకుండా.. బిస్కెట్ల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Palli Biscuits : మ‌న‌కు మార్కెట్ లో వివిధ ర‌కాల బిస్కెట్లు అందుబాటులో ఉన్నాయి. బిస్కెట్ల‌ను పిల్ల‌లతో పాటు పెద్ద‌లు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. బిస్కెట్లు రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు ఎందుకంటే వీటిని మైదాపిండితో త‌యారు చేస్తూ ఉంటారు. మైదాపిండితో చేసిన బిస్కెట్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో హాని క‌లుగుతుంది. బ‌య‌ట ల‌భించే బిస్కెట్ల‌కు బ‌దులుగా మ‌నం ఇంట్లోనే రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా ప‌ల్లి బిస్కెట్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఎక్కువ మొత్తంలో త‌యారు చేసుకుని నెల‌రోజుల పాటు తిన‌వ‌చ్చు. ఇంట్లో ఒవెన్ లేకపోయినా కూడా ఈ బిస్కెట్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ ప‌ల్లి బిస్కెట్ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌ల్లి బిస్కెట్ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – ఒక క‌ప్పు, పంచ‌దార – 2 టేబుల్ స్పూన్స్, యాల‌కులు – 2, గోధుమ‌పిండి – 2 టేబుల్ స్పూన్స్, శ‌న‌గ‌పిండి – 2 టేబుల్ స్పూన్స్, వంట‌సోడా – చిటికెడు.

Palli Biscuits recipe make in this method
Palli Biscuits

ప‌ల్లి బిస్కెట్ల త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించాలి. వీటిని మాడిపోకుండా దోర‌గా వేయించిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని పొట్టు తీసి వేయాలి. త‌రువాత ఒక జార్ లో పంచ‌దార వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత వేయించిన ప‌ల్లీలు, యాల‌కులు వేసి పేస్ట్ లాగా అయ్యే వ‌ర‌కు మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ ప‌ల్లీ మిశ్ర‌మాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో జ‌ల్లించిన గోధుమ‌పిండి, శ‌న‌గ‌పిండి, వంట‌సోడా వేసి బాగా క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత ప్లేట్ ను తీసుకుని దానికి నెయ్యి రాయాలి. త‌రువాత దానిపై గోధుమ‌పిండిని చ‌ల్లుకోవాలి లేదా బ‌ట‌ర్ పేప‌ర్ ను ఉంచాలి. ఇప్పుడు పిండిని తీసుకుని ముందు గుండ్రంగా చేసి త‌రువాత బిస్కెట్ల ఆకారంలో వ‌త్తుకోవాలి.

త‌రువాత మ‌ధ్య‌లో చిన్న‌గా గుంత చేసి అందులో వేయించిన ప‌ల్లీలు ఉంచి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో స్టాండ్ ను ఉంచి దానిపై మూత పెట్టి ఫ్రీహీట్ చేసుకోవాలి. త‌రువాత బిస్కెట్ల ప్లేట్ ను ఉంచి మ‌ధ్య‌స్థ మంట‌పై 15 నుండి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. త‌రువాత ప్లేట్ ను బ‌య‌ట‌కు తీసి చ‌ల్లారిన త‌రువాత బిస్కెట్ల‌ను స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌ల్లి బిస్కెట్లు త‌యార‌వుతాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసిన బిస్కెట్ల‌ను పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts