High Cholesterol Diet : కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉందా.. అయితే ఈ 4 ప‌దార్థాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌కండి..!

High Cholesterol Diet : మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా త‌లెత్తుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య కూడా ఒక‌టి. శ‌రీరంలో ఎక్కువ‌గా చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి మ‌న‌లో చాలా మంది తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నారు. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ కార‌ణంగా గుండె జ‌బ్బులు, గుండెపోటు, స్ట్రోక్ వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. కొంద‌రు ఈ స‌మ‌స్య కార‌ణంగా ప్రాణాల‌ను కూడా కోల్పోతున్నారు. వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ పుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, కూర్చుని ప‌ని చేయ‌డం, త‌గినంత శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత చాలా మంది ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య చాలా ప్రమాద‌క‌ర‌మైన‌ది. ఈ స‌మ‌స్య‌ను ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. త‌గిన మందుల‌ను వాడుతూనే ఆహార నియ‌మాలను కూడా పాటించాలి.

అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ముఖ్యంగా ఈ 4 ఆహారాల‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు తీసుకోకూడ‌ని 4 ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మాంసాన్ని త‌క్కువ‌గా తీసుకోవాలి. వీటిలో కొవ్వు ఎక్కువ‌గా ఉంటుంది. మాంసం అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారికి అంత మంచిది కాదు. క‌నుక ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మాంసానికి పూర్తిగా దూరంగా ఉండ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాల‌కు కూడా దూరంగా ఉండాలి. డీప్ ఫ్రై చేసిన ఆహారాల్లో కొలెస్ట్రాల్ తో పాటు క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. క‌నుక డీప్ ప్రైకి బదులుగా ఆలివ్ నూనెతో ఎయిర్ ప్రైయ‌ర్ లో త‌యారు చేసి తీసుకోవ‌డం మంచిది. అదే విధంగా అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ప్రాసెస్డ్ మాంసాన్ని, ప్రాసెస్డ్ ఆహారాల‌ను తీసుకోవ‌డం త‌గ్గించాలి.

High Cholesterol Diet stay away from these 4 types of foods
High Cholesterol Diet

వీటిలో అధిక మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. అలాగే పోష‌కాలు త‌క్కువ‌గా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలం అవుతుంది. క‌నుక అధిక కొలెస్ట్రాల్ తో బాధ‌ప‌డే వారు ప్రాసెస్డ్ ఆహారాల‌కు కూడా దూరంగా ఉండాలి. అలాగే ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు బిస్కెట్లు, కేక్ లు, పేస్ట్రీ వంటి ఆహారాల‌కు కూడా దూరంగా ఉండాలి. వీటిలో కొలెస్ట్రాల్ అధిక మొత్తంలో ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌పడే వారు ఈ 4 ఆహారాల‌కు దూరంగా ఉండ‌డం చాలా మంచిది. వీటికి బ‌దులుగా ఫైబ‌ర్, మిన‌ర‌ల్స్ ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. పండ్లు, కూర‌గాయ‌లను ఎక్కువ‌గా తీసుకోవాలి. అలాగే ప్ర‌తిరోజూ వ్యాయామం చేయాలి. త‌గిన ఆహారాల‌ను తీసుకుంటూ, చ‌క్క‌టి జీవ‌న‌శైలిని పాటించ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts