Pomegranate Juice : దానిమ్మ పండ్లతో జ్యూస్‌ తయారీ ఇలా.. ఎంతో రుచికరం.. ఆరోగ్యకరం..

Pomegranate Juice : మనకు ఏడాది పొడవునా దాదాపుగా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే పండ్లలో దానిమ్మ పండ్లు కూడా ఒకటి. ఇవి చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే దానిమ్మ పండ్లను కొందరు తినేందుకు ఇష్టపడరు. కానీ జ్యూస్‌లా చేసి తాగుతారు. అయితే దానిమ్మ పండ్లతో జ్యూస్‌ తయారు చేసి తాగితే దాంతో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ జ్యూస్‌ మనకు పోషకాలను, శక్తిని కూడా అందిస్తుంది. దానిమ్మ పండ్ల జ్యూస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దానిమ్మ పండ్ల జ్యూస్‌ తయారీకి కావల్సిన పదార్థాలు..

దానిమ్మ పండ్లు – రెండు లేదా మూడు (పెద్దవి), నీళ్లు – తగినంత, తేనె – రుచికి సరిపడా, చియా సీడ్స్‌ – ఒక స్పూన్‌, నిమ్మరసం – కొద్దిగా.

Pomegranate Juice this is the way to make it
Pomegranate Juice

దానిమ్మ పండ్ల జ్యూస్‌ను తయారు చేసే విధానం..

ముందుగా దానిమ్మ పండ్లను ఒలిచి పొట్టు తీయాలి. లోపల ఉండే గింజలను సేకరించాలి. తరువాత ఈ గింజలను జార్‌లో వేయాలి. అనంతరం మిక్సీ పట్టి జ్యూస్‌ తీయాలి. ఇందులో రుచికి సరిపడా తేనె, నిమ్మరసం వేసి కలపాలి. కాసిన్ని చియా సీడ్స్‌ను కూడా వేయాలి. ఈ జ్యూస్‌ను ఫ్రిజ్‌లో పెట్టాలి. మూడు లేదా నాలుగు గంటల అనంతరం చియా సీడ్స్‌ జెల్‌లా మారుతాయి. అప్పుడు జ్యూస్‌ను తాగవచ్చు. ఇలా దానిమ్మ పండ్ల జ్యూస్‌ను తయారు చేసి తాగవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరం కూడా. ఇలా దానిమ్మ పండ్లతో జ్యూస్‌ను తయారు చేసి రోజూ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక వీటిని రోజూ తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఐరన్‌ బాగా లభిస్తుంది. దీంతో రక్తం అధికంగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. అలాగే ఈ పండ్లను తీసుకుంటే బీపీ, షుగర్‌ తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. ఇలా దానిమ్మ పండ్లతో మనం ఎన్నో లాభాలను పొందవచ్చు. కనుక వీటిని రోజూ ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా తీసుకోవాలి.

Editor

Recent Posts