Bhujangasana : రోజూ 5 నిమిషాల పాటు ఈ ఆసనం వేయండి చాలు.. మీ పొట్ట ఫ్లాట్‌గా మారుతుంది..!

Bhujangasana : యోగాలో అనేక రకాల ఆసనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. చాలా మంది నేటి తరుణంలో యోగా చేస్తున్నారు. వివిధ రకాల వ్యాధులతో బాధపడేవారు కూడా యోగాను ఆశ్రయిస్తున్నారు. దీని వల్ల వ్యాధులు తగ్గేందుకు, ఎక్కువ కాలం జీవించేందుకు అవకాశం ఉంటుంది. అయితే యోగాలో కొన్ని సులభంగా వేయదగిన ఆసనాలు ఉన్నాయి. వాటిల్లో భుజంగాసనం కూడా ఒకటి. సంస్కృతంలో భుజంగ అనే పదానికి పాము అని అర్థం వస్తుంది. పాము పడగ విప్పినప్పుడు ఎలాగైతే ఆకారంలో ఉంటుందో.. సరిగ్గా అదే ఆకారంలో ఈ ఆసనాన్ని వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే భుజంగాసనాన్ని ఎలా వేయాలి.. దీంతో ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

చిత్రంలో చూపినట్లుగా ముందుగా మ్యాట్ పై బోర్లా పడుకోవాలి. తరువాత చేతులపై నెమ్మదిగా ఛాతి భాగాన్ని పైకి లేపాలి. అనంతరం తలను పైకెత్తి చూడాలి. పడగ విప్పిన పాము ఆకారంలో ఆసనం రావాలి. ఈ భంగిమలో 5 నిమిషాల పాటు ఉండాలి. తరువాత మళ్లీ మామూలు స్థితికి రావాలి.

Bhujangasana in telugu how to do it and health benefits
Bhujangasana

ఇలా ఈ ఆసనాన్ని ఆరంభంలో రోజూ కనీసం 5 నిమిషాల పాటు అయినా సరే వేయాలి. తరువాత సౌకర్యాన్ని బట్టి ఈ ఆసనం సమయాన్ని పెంచుతూ పోవచ్చు. ఇలా ఈ ఆసనాన్ని రోజూ వేయడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

భుజంగాసనం వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..

భుజంగాసనం వేయడం వల్ల భుజాలు, మెడ భాగాల్లో ఉండే దృఢత్వం పోతుంది. దీంతో ఆయా భాగాల్లో ఉండే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసేవారికి భుజాలు, మెడ భాగాలు నొప్పిగా ఉంటాయి. అలాంటి వారు ఈ ఆసనం వేస్తే నొప్పుల నుంచి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ ఆసనం వేయడం వల్ల ఛాతి, పొట్ట కండరాలు దృఢంగా మారుతాయి. ఆస్తమా, దగ్గు, జలుబు ఉన్నవారికి మేలు జరుగుతుంది.

పొత్త కడుపు కండరాలపై ఒత్తిడి పడుతుంది. కనుక పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది. నెల రోజుల పాటు ఈ ఆసనాన్ని వేస్తే వచ్చే మార్పును మీరే గమనిస్తారు. ఇక ఈ ఆసనం వేయడం వల్ల వెన్నెముక దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది. వెన్ను నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇక తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, చేతుల్లో బాగా నొప్పి ఉన్నవారు, దృఢత్వం లేని వారు ఈ ఆసనాన్ని వేయకూడదు. మిగిలిన ఎవరైనా సరే ఈ ఆసనాన్ని వేసి ప్రయోజనాలను పొందవచ్చు.

Editor

Recent Posts