Potato Nuggets : రెస్టారెంట్ల‌లో ల‌భించే పొటాటో న‌గ్గెట్స్‌ను ఎంతో ఈజీగా ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Potato Nuggets : మ‌నకు రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ఎక్కువ‌గా ల‌భించే చిరుతిళ్ల‌ల్లో పొటాటో న‌గ్గెట్స్ ఒక‌టి. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ పొటాటో న‌గ్గెట్స్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. క‌ర‌క‌ర‌లాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ పొటాటో న‌గ్గెట్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పొటాటో న‌గ్గెట్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బంగాళాదుంప‌లు – పావు కిలో, బ్రెడ్ క్రంబ్స్ – ఒక క‌ప్పు, చీస్ – 2 టేబుల్ స్పూన్స్, మిక్స్డ్ హెర్బ్స్ – అర టీ స్పూన్, చిల్లీ ప్లేక్స్ – ఒక టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, ఉప్పు – త‌గినంత‌.

Potato Nuggets recipe in telugu make in this method
Potato Nuggets

పొటాటో న‌గ్గెట్స్ త‌యారీ విధానం..

ముందుగా ఉడికించిన బంగాళాదుంప‌ల‌ను మెత్త‌గా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అందులో 2 టేబుల్ స్పూన్ల బ్రెడ్ క్రంబ్స్ వేసుకోవాలి. త‌రువాత నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల్నీ వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిని ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. ఇప్పుడు మ‌రో గిన్నెలో టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ ను వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా ప‌లుచ‌గా క‌లుపుకోవాలి. త‌రువాత ఫ్రిజ్ లో ఉంచిన బంగాళాదుంప మిశ్ర‌మాన్ని మ‌రోసారి క‌లుపుకుని కొద్ది కొద్దిగా తీసుకుంటూ న‌గ్గెట్స్ ఆకారంలో వత్తుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత ఈ న‌గ్గెట్స్ ను కార్న్ ఫ్లోర్ మిశ్ర‌మంలో ముంచాలి. త‌రువాత వీటిని తీసి బ్రెడ్ క్రంబ్స్ లో వేసి కోట్ చేసుకోవాలి.

బ్రెడ్ క్రంబ్స్ న‌గ్గెట్స్ కు బాగా ప‌ట్టిన త‌రువాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత వీటిని ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. ఒక గంట త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ముందుగా త‌యారు చేసుకున్న న‌గ్గెట్స్ ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పొటాటో నగ్గెట్స్ త‌యార‌వుతాయి. వీటిని ట‌మాట కిచ‌ప్, మ‌యోనీస్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం స‌మ‌యాల్లో బంగాళాదుంప‌ల‌తో ఈ విధంగా న‌గ్గెట్స్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts