Natural Protein Powder : మొక్క భాగాల్లో అన్నింటి కంటే గింజలకు ఎక్కువ శక్తి ఉంటుంది. ఒక్కో గింజకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇలా ఎంతో శక్తివంతమైన వివిధ రకాల గింజలను కలిపి తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇలాంటి గింజల మిశ్రమాన్ని రోజుకు ఒకటి లేదా రెండు స్పూన్ల మోతాదులో తీసుకుంటే చాలు కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, మలబద్దకం, మధుమేహం వంటి అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. మారిన మన జీవన విధానం, మన ఆహారపు అలవాట్ల కారణంగా వచ్చే వివిధ రకాల అనారోగ్య సమస్యలన్నింటిని ఈ గింజల మిశ్రమంతో తగ్గించుకోవచ్చు. మన చక్కటి ఆరోగ్యాన్ని చేకూర్చే ఈ గింజల పొడిని తయారు చేసుకోవడానికి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పొడిని తయారు చేసుకోవడానికి గానూ మనం సొరకాయ గింజలు, నువ్వులు, అవిసె గింజలు, సోంపు గింజలు, పుచ్చ గింజలు, పొద్దు తిరుగుడు గింజలు నల్ల ఉప్పును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా వీటిని ఒక కళాయిలో వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే నల్ల ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని నోట్లో వేసుకుని చప్పరించడం లేదా నీటిలో కలుపుకుని తాగడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
అలాగే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఈ పొడిని తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే చర్మాన్ని సంరక్షించడంలో కూడా ఈ పొడి మనకు దోహదపడుతుంది. అలాగే స్త్రీలు ఈ పొడిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ పొడిని తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో వచ్చే సమస్యలు తగ్గు ముఖం పడతాయి. హార్మోన్ల సమస్యలు తలెత్తకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా ప్రస్తుత కాలంలో చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ పొడిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
అలాగే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు మూల కారణమయ్యే మలబద్దకం సమస్యను కూడా ఈ పొడితో తగ్గించుకోవచ్చు. ఈ పొడిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తి మెరుగుపరిచి మలబద్దకం సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇలా వివిధ రకాల గింజలతో చేసిన ఈ పొడిని మూడు పూటలా పూటకు ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడంతో పాటు వాటి బారిన కూడా పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.