Putnala Pappu Laddu : పుట్నాల ల‌డ్డూల‌ను ఇలా చేసి తింటే.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఒక్క‌టి ఎక్కువే తింటారు..

Putnala Pappu Laddu : మ‌న‌కు తినేందుకు తియ్య‌ని ప‌దార్థాలు అనేకం అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ల‌డ్డూలు కూడా ఒక‌టి. ల‌డ్డూల‌ను భిన్న ర‌కాల ప‌దార్థాల‌తో చేస్తుంటారు. అయితే పుట్నాల‌తోనూ ల‌డ్డూల‌ను చేయ‌వ‌చ్చు. బెల్లంతో చేసే ఈ ల‌డ్డూలు ఎంతో రుచిగా ఉంటాయి. త‌యారు చేయ‌డం కూడా సుల‌భమే. పుట్నాల‌తో ల‌డ్డూల‌ను చేస్తే చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పుట్నాల ల‌డ్డూల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పుట్నాల ప‌ప్పు – 4 క‌ప్పులు, బెల్లం త‌రుగు – 2 క‌ప్పులు, నెయ్యి – త‌గినంత‌, యాల‌కుల పొడి – అర టీస్పూన్‌.

Putnala Pappu Laddu  recipe in telugu make in this way
Putnala Pappu Laddu

పుట్నాల ల‌డ్డూల‌ను త‌యారు చేసే విధానం..

అడుగు భాగంలో మందంగా ఉండే పాత్ర తీసుకుని అందులో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి బెల్లాన్ని పాకం వ‌చ్చేంత వ‌ర‌కు మ‌రిగించుకోవాలి. ఇందులో పుట్నాల ప‌ప్పు, యాల‌కుల పొడి, చివ‌రిగా నెయ్యి వేసి క‌లియ‌బెట్టాలి. బాగా తిప్పిన త‌రువాత దింపేయాలి. త‌రువాత కాస్త గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడే ల‌డ్డూల్లా చుట్టుకోవాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన పుట్నాల ల‌డ్డూలు రెడీ అవుతాయి. వీటిని రోజుకు ఒక‌టి లేదా రెండు చొప్పున తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటాయి.

Share
Editor

Recent Posts