Puffed Rice : మనలో చాలా మంది అనేక రకాల స్నాక్స్‌ను తింటుంటారు. వాటిల్లో మరమరాలతో చేసే స్నాక్స్ కూడా ఒకటి. వీటితో ఉగ్గాని, ముంత మసాలా, చాట్, భెల్ పూరీ వంటివి చేస్తారు. అందువల్ల ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే వాస్తవానికి మరమరాలు మనకు ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి మనకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. మరమరాలతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యాన్ని అధిక వేడి వద్ద భారీగా పీడనం ప్రయోగించి ప్రాసెస్ చేస్తారు. దీంతో మరమరాలు ఏర్పడుతాయి. వీటినే పఫ్డ్ రైస్ అని కూడా అంటారు. సాధారణ బియ్యం కన్నా ఈ మరమరాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. పోషకాలను, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. మరమరాలను 100 గ్రాముల మోతాదులో తింటే మనకు 402 క్యాలరీల శక్తి లభిస్తుంది. వీటిల్లో కొవ్వులు, శాచురేటెడ్ ఫ్యాట్, కార్బొహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్లు, కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, విటమిన్ బి6, థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, నేట్రియం, కాలియం తదితర పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
మరమరాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక ఇది మలబద్దకం సమస్య నుంచి బయట పడేస్తుంది. ఈ సమస్య ఉన్నవారు తరచూ మరమరాలను తింటే మేలు జరుగుతుంది. అలాగే జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అల్సర్లు, కడుపు ఉబ్బరం, డయేరియా వంటి ఇతర జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక మరమరాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఉంటాయి. కనుక వీటిని తింటే మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే వైరస్, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. జ్వరం, జలుబు, గొంతు సమస్యలు, ఇతర సీజనల్ వ్యాధుల నుంచి బయట పడవచ్చు.
మరమరాలను తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. దీంతో గుండె జబ్బులు రావు. అలాగే బరువు కూడా తగ్గుతారు. వీటిల్లో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. అలాగే మరమరాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కనుక చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముడతలు, మచ్చలు, కళ్ల కింద నల్లని వలయాలు తగ్గుతాయి. అయితే మరమరాలు ఆరోగ్యకరమే అయినప్పటికీ షుగర్ ఉన్నవారు మాత్రం వీటికి దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే వీటిల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కనుక మరమరాలను షుగర్ ఉన్నవారు తినరాదు. ఇక మిగిలిన ఎవరైనా సరే వీటిని నిర్భయంగా తినవచ్చు. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.