Royal Rose Faluda : బండ్ల‌పై ల‌భించే రాయ‌ల్ రోస్ ఫ‌లూదా.. ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు..!

Royal Rose Faluda : వేసవి కాలం రాగానే మ‌న‌కు రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద‌, షాపుల్లో ఎక్కువ‌గా ల‌భించే ప‌దార్థాల్లో రాయ‌ల్ రోస్ ఫాలుదా కూడా ఒక‌టి. ఫాలుదా చ‌ల్ల చ‌ల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఈ రాయ‌ల్ రోస్ ఫాలుదాను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కాస్త ఓపిక ఉంటే చాలు దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. అచ్చం బ‌య‌ట ల‌భించే రుచితో ఈ రాయ‌ల్ రోస్ ఫాలుదాను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రాయ‌ల్ రోస్ ఫాలుదా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

రోస్ మిల్క్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పాలు – రెండు క‌ప్పులు, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, పంచ‌దార – 3 టేబుల్ స్పూన్స్, రోస్ సిర‌ప్ – 3 టేబుల్ స్పూన్స్, న‌నాబెట్టిన స‌బ్జా గింజ‌లు – 2 టేబుల్ స్పూన్స్.

Royal Rose Faluda recipe in telugu very tasty summer cool drink
Royal Rose Faluda

సేమియా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కార్న్ ఫ్లోర్ – అర క‌ప్పు, నీళ్లు – పావు క‌ప్పు, పంచ‌దార – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్, ఐస్ క్యూబ్స్ – 15, చ‌ల్ల‌టి నీళ్లు – లీట‌ర్.

రాయ‌ల్ రోస్ ఫాలుదా త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో పావు క‌ప్పు పాల‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో కార్న్ ఫ్లోర్ ను వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. త‌రువాత గిన్నెలో మిగిలిన పాలు పోసి క‌లుపుతూ వేడి చేయాలి. పాలు ఒక పొంగు వ‌చ్చిన త‌రువాత పంచ‌దార వేసి క‌ల‌పాలి. పంచ‌దార క‌రిగిన త‌రువాత కార్న్ ఫ్లోర్ పాల‌ను వేసి క‌ల‌పాలి. వీటిని మధ్య‌స్థ మంట‌పై 5 నిమిషాల పాటు క‌లుపుతూ మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఇందులో రోజ్ సిర‌ప్ ను వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఈ పాల‌ను 2 నుండి 3 గంట‌ల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. ఇప్పుడు సేమియా త‌యారీ గురించి తెలుసుకుందాం. ముందుగా అర క‌ప్పు కార్న్ ఫ్లోర్ లో పావు క‌ప్పు నీళ్లు పోసి ఉండ‌లు లేకుండా క‌లుపుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత మ‌రో గిన్నెలో పావు లీట‌ర్ నీళ్లు పోసి మ‌రిగించాలి.

మ‌రుగుతున్న నీళ్లల్లో పంచదార వేసి క‌ల‌పాలి. పంచ‌దార క‌రిగి నీళ్లు మ‌రుగుతున్న‌ప్పుడు ముందుగా సిద్దం చేసుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్ర‌మాన్ని వేసి క‌ల‌పాలి. దీనిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఉండ‌లు లేకుండా క‌లుపుతూ హ‌ల్వా లాగా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత ఒక గిన్నెలో ఐస్ క్యూబ్స్ ను, చ‌ల్ల‌టి నీటిని తీసుకోవాలి. త‌రువాత మురుకుల గొట్టాన్ని తీసుకుని అందులో చిన్న రంధ్రాలు ఉన్న బిళ్ల‌ను ఉంచాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన కార్న్ ఫ్లోర్ మిశ్ర‌మాన్ని ఉంచి ఐస్ క్యూబ్స్ పై సేమియా లాగా వ‌త్తుకోవాలి. త‌రువాత ఈ సేమియాను గిన్నెతో స‌హా క‌దిలించ‌కుండా ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. ఇప్పుడు పెద్ద గ్లాస్ లో 2 టేబుల్ స్పూన్స్ రోజ్ సిర‌ప్ ను వేసుకోవాలి. త‌రువాత దీనిపై ఒక టేబుల్ స్పూన్ నాన‌బెట్టిన స‌బ్జా గింజ‌ల‌ను వేసుకోవాలి.

త‌రువాత దీనిపై ముందుగా త‌యారు చేసుకున్న సేమియాను ఒక లేయ‌ర్ గా వేసుకోవాలి. త‌రువాత దీనిపై రోజ్ మిల్క్ ను వేసుకోవాలి. దీనిని గ్లాస్ కు ముప్పావు భాగం వ‌చ్చే వ‌ర‌కు నింపిన త‌రువాత దానిపై మ‌రో టేబుల్ స్పూన్ స‌బ్జా గింజ‌ల‌ను వేసుకోవాలి. త‌రువాత దానిఐ మ‌రో లేయ‌ర్ సేమియాను వేసుకోవాలి. త‌రువాత దీనిపై మ‌ర‌లా రోజ్ మిల్క్ ను పోయాలి. త‌రువాత దీనిపై ఒక స్కూబ్ ఐస్ క్రీమ్ ను ఉంచి దానిపై చెర్రీ, రోజ్ సిర‌ప్ ను వేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల రాయ‌ల్ రోస్ ఫాలుదా త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తాగుతారు. వేస‌వి కాలంలో దీనిని తాగ‌డం వ‌ల్ల వేడి నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

D

Recent Posts