ఈమధ్య కాలంలో చాలా మందికి సోషల్ మీడియాలో అసలు ఎలాంటి పోస్టులు పబ్లిష్ చేయాలి అన్న జ్ఞానం లేకుండా పోతోంది. కొందరు అసభ్యకరమైన వీడియోలను షేర్ చేస్తుంటే కొందరు ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. ఇంకా కొందరు జంతువులను హింసిస్తూ వాటిని వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. ఇలా వారు రాక్షసానందం పొందుతున్నారు. ఇలాంటి వెధవలను ఎందరు ఎన్ని తిట్టినా తమ బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. తాజాగా ఇలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఒక చోట కట్టేసి ఉన్న ఆవును పక్కనే ఉన్న నాగుపాము మూడు సార్లు కాటేయడాన్ని కింద ఇచ్చిన వీడియోలో చూడవచ్చు. పాపం ఆ ఆవు బాధతో విలవిలలాడుతుంటే సదరు వ్యక్తి వీడియో తీస్తున్నాడు కానీ పాము నుంచి ఆవును రక్షించే ప్రయత్నం మాత్రం చేయలేదు. పైగా ఆ వీడియోను అతను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ కాగా దానిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి వీడియోలను పోస్ట్ చేసిన వారిని ఊరికే విడిచిపెట్టొద్దని, మూగజీవాలను హింసించే వారిపై కేసు పెట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో పెట్టిన వ్యక్తిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.