ఆధ్యాత్మికం

Srisailam Istakameswari Temple : ఇక్క‌డ అమ్మ‌వారికి బొట్టు పెట్టి ఏం కోరుకున్నా.. అది నెర‌వేరుతుంది..!

Srisailam Istakameswari Temple : శ్రీశైలంలో ఒక రహస్య ప్రదేశం ఉంది. అయితే ఆ ప్రదేశంలో మహిమగల అమ్మవారి దేవాలయం ఉంది. ఇక్కడ అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే తప్పక అది నెరవేరుతుంది. పైగా ఇక్కడ అమ్మవారి నుదురు మనిషి యొక్క నుదురు లాగా మెత్తగా ఉంటుందట. తిరుమల తర్వాత ఆదరణ కలిగిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. శ్రీశైలంలో మల్లన్న కొలువై ఉన్నారు. ఇక్కడ పర్వతాలపై మల్లన్నని ఒకప్పుడు చుట్టుపక్కల వుండే గూడెం ప్రజలు మాత్రమే దర్శించుకోవడం జరిగేది.

కానీ ఇప్పుడు వివిధ దేశాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. సిద్ధ క్షేత్రం ఇది. ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇక్కడ అరణ్యంలో ఉంటాయి. ప్రాచీన కాలం నుండి కూడా ఇక్కడ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ పూజలు జరుగుతూ ఉండేవి. అయితే అత్యంత విశిష్టమైనదిగా ఇష్టకామేశ్వరి ఆలయం ఇక్కడ దర్శనమిస్తుంది. ఇదివరకు సిద్ధుల‌ పూజలు అందుకున్న ఇష్ట కామేశ్వరి దేవి ఇప్పుడు భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తోంది.

Srisailam Istakameswari Temple your wishes will be fulfilled here

శ్రీశైలం నుండి డోర్నాల వెళ్లే దారిలో ఈ ఆలయం ఉంటుంది. దట్టమైన అడవిలో వెళుతూ ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళగానే శక్తివంతమైన ప్రదేశంలో ఉన్నట్లు మనకి అనిపిస్తుంది. ఇక్కడ ఆలయంలో అమ్మవారు నాలుగు భుజాలని కలిగి ఉంటారు. రెండు చేతుల్లో తామర పూలు, మిగతా రెండు చేతుల్లో జపమాల ఉంటాయి. ఈ అమ్మవారు శివలింగం ధరించి కనపడతారు. అమ్మవారికి నిమ్మకాయల దండలు వేస్తారు.

నుదురు మెత్తగా ఉంటుందని ఆలయ అర్చకులు చెప్తున్నారు. ప్రయాణం మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. దట్టమైన అడవుల‌ లోపల నుండి వెళ్లాల్సి ఉంటుంది. అటవీ మార్గంలో ఒక కిలో మీటర్ నడక తర్వాత, చెంచు ప్రజల గూడాల మధ్య అమ్మవారి ఆలయం ఉంటుంది. డోర్నాల మార్గంలో దాదాపు 12 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇక్కడ అమ్మవారికి బొట్టు పెడితే మనిషి నుదురు ఎలా మెత్తగా ఉంటుందో అలా ఉంటుందట. ఈ అమ్మవారి దగ్గరికి వెళ్లి, మనం ఏ కోరికైనా కోరుకుంటే అది కచ్చితంగా నెర‌వేరుతుంద‌ట‌.

Admin

Recent Posts