food

తీయతీయగా పన్నీర్ పాయసం తయారీ విధానం!

ఎప్పుడు ఒకేవిధమైన పాయసం తిని ఎంతో బోర్ కొడుతుందా. అయితే ఈ సారి వెరైటీగా ఎంతో టేస్టీగా పన్నీర్ పాయసం తయారు చేసుకొని ఆనందించండి.అయితే మరి రుచికరమైన పన్నీర్ పాయసం ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

పన్నీర్ ఒక కప్పు, చిక్కటి పాలు ఒక లీటర్, చక్కెర పావు కప్పు, బియ్యపు పిండి ఒక టేబుల్ స్పూన్, ఏలకుల పొడి పావు టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ గుప్పెడు, కుంకుమ పువ్వు చిటికెడు, నెయ్యి టేబుల్ స్పూన్.

paneer payasam recipe how to make this

తయారీ విధానం

ముందుగా టేబుల్ స్పూన్ నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ ను దోరగా వేయించుకోవాలి. తరువాత స్టవ్పై ఒక గిన్నెలో పాలను వేసి పాలు బాగా మరిగే దాకా కలియబెడుతూ ఉండాలి. పాలు బాగా మరిగిన తరువాత కుంకుమ పువ్వు బియ్యపు పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. పది నిమిషాలు బాగా ఉడికిన తరువాత ఈ మిశ్రమంలోకి ముందుగా వేయించుకున్న కొన్ని డ్రైఫ్రూట్స్, ఏలకులపొడి వేసి రెండు నిమిషాల పాటు ఉడికించి తరువాత పంచదార వేయాలి. పంచదార వేసిన తరువాత ఈ మిశ్రమం గట్టిపడేవరకు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం గట్టిపడుతున్న క్రమంలో మంటను తగ్గించుకుని పన్నీర్ తురుము వేసి బాగా కలియబెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా ఉన్న ఈ పాయసంలోకి మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడివేడిగా తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది.

Admin

Recent Posts