Tamanna Bhatia : త‌మ‌న్నా మ్యూజిక్ వీడియో.. ఒక రేంజ్‌లో ఉందిగా..!

Tamanna Bhatia : ప్ర‌స్తుత త‌రుణంలో సినిమా రంగంలో హీరోయిన్లు త‌మ‌కు అందివ‌చ్చిన అవ‌కాశాల‌ను ప్ర‌తి దాన్ని స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. ఏ పుట్ట‌లో ఏ పాము ఉందో ఎవ‌రికి తెలుసు ? ఏ ఆఫ‌ర్‌ను వ‌దులుకుంటే ఏమ‌వుతుందో ? అని వ‌చ్చిన ఆఫ‌ర్‌ను కాద‌న‌కుండా ద‌క్కించుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగానే స‌మంత ఆ మ‌ధ్య పుష్ప మూవీలో ఐట‌మ్ సాంగ్ చేసి అల‌రించ‌గా.. ఇప్పుడు త‌మ‌న్నా ఒక మ్యూజిక్ వీడియోలో క‌నిపించి అల‌రించింది.

Tamanna Bhatia  latest music video viral in social media
Tamanna Bhatia

త‌మ‌న్నా లాంటి హీరోయిన్ మ్యూజిక్ వీడియోలో న‌టించ‌డం అంటే.. ఆమె తాహ‌తుకు అది త‌గిన స్థాయి కాదు. కానీ ఆమెకు సినిమాల్లో పెద్ద‌గా ఆఫ‌ర్లు లేవు. క‌నుక దీని ద్వారా అయినా పాపులర్ అవుదాం.. అనుకుందో.. ఏమో గానీ.. ర్యాప‌ర్ బాద్‌షాతో క‌లిసి ఓ మ్యూజిక్ వీడియో చేసింది. ఈ క్ర‌మంలోనే ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇక ఈ వీడియోలో త‌మ‌న్నా త‌న మిల్కీ అందాల‌ను ఆర‌బోసింది. స‌హ‌జంగానే ఈ అమ్మ‌డు ఎల్ల‌ప్పుడూ గ్లామ‌ర్ షో చేస్తుంటుంది. ఇక ఈ సాంగ్‌లో అయితే మ‌రింత‌గా రెచ్చిపోయింది. ఈ సాంగ్ గురించిన వివ‌రాల‌ను ఈమె త‌న ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. అంద‌రూ ఈ సాంగ్‌ను వీక్షించాల‌ని ఆమె కోరింది.

Editor

Recent Posts