sports

చెత్త‌కు మారుపేరు టీమిండియా బ్యాటింగ్‌.. తెల్ల‌సున్నం వేసిన కివీస్‌..

అనుకున్న‌ట్లే జ‌రిగింది. మూడో టెస్టులో అయినా గెలుస్తార‌ని ఆశ‌లు పెట్టుకున్న ఫ్యాన్స్‌ను టీమిండియా బ్యాట్స్‌మెన్ మ‌రోమారు నిరాశ ప‌రిచారు. అత్యంత చెత్త ఆట ఆడి ప‌రువు పోగొట్టుకోవ‌డ‌మే కాదు కివీస్ చేత తెల్ల సున్నం వేయించుకున్నారు. భార‌త్‌పై న్యూజిలాండ్ 3-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను వైట్ వాష్ చేసి చ‌రిత్ర సృష్టించింది. మూడో టెస్టులోనూ న్యూజిలాండ్ అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

147 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కూడా ఛేదించ‌లేక భార‌త బ్యాట్స్‌మెన్లు చ‌తికిల ప‌డ్డారు. గెలిచే అవ‌కాశం ఉన్న‌ప్పటికీ దాన్ని చేజేతులారా వ‌దిలేసుకున్నారు. ఇలా ఆడ‌మ‌ని కోచ్ చెప్తున్నాడో, లేక బ్యాట్స్‌మెన్‌కు స‌త్తా లేదో తెలియ‌దు కానీ.. భార‌త అభిమానులు మాత్రం టీమిండియా బ్యాట్స్ మెన్‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గెలిచే మ్యాచ్‌లోనూ పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో కేవ‌లం 25 ప‌రుగుల తేడాతో ఓడిపోవ‌డాన్ని వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు. మ‌రోవైపు కివీస్ శ్రీ‌లంక‌లో 0-2 తేడాతో ఓడి ప‌రాభ‌వం పాలైనా ఇండియాను ఇండియాలో ఓడించి 3-0తో విజ‌య ద‌ర‌హాసం చేసింది.

team india lost in third test also with newzealand

టీమిండియా మూడింటికి మూడు టెస్టులు ఓడిపోవ‌డంపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వెంట‌నే రోహిత్‌, కోహ్లి రిటైర్మెంట్ తీసుకోవాల‌ని, ఇత‌ర ప్లేయ‌ర్ల‌కు చాన్స్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇంత చెత్త బ్యాటింగ్‌తో త్వ‌ర‌లో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు ఎలా వెళ్తార‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌నైనా టీమిండియా త‌న లోపాల‌పై దృష్టి పెట్టాల‌ని, ప్ర‌యోగాలు మాని అర్హులైన ప్లేయ‌ర్ల‌కు అవ‌కాశాలు ఇవ్వాల‌ని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Admin

Recent Posts