lifestyle

అదృష్టం పట్టే ముందు కనిపించే సంకేతాలు ఇవే..!

కొంతమందిని అనేక సమస్యలు బాధిస్తూ ఉంటాయి. ఆ సమస్యల్లో ఆర్థిక సమస్యలు ఒకటి. ధనం మూలం ఇదం జగత్తు అన్నారు పెద్దలు. తన సమస్య అనేది తీరని లోటుగా కొంతమందికి ఉండిపోతుంది. అయితే కొంద‌రికి మాత్రం ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుంది. వారిని అదృష్ట‌వంతులు అంటుంటారు. ఇలాంటి వారికి ఆర్థిక సమస్యలు పోయి అనుకోకుండా అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది. అయితే లక్ష్మీదేవిని సంపదల దేవతగా పరిగణిస్తూ ఉంటాం. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు.. ఎవరైనా ధనవంతులవుతారని తమ జీవితాంతం సంతోషంగా ఉంటామని తమ ఇల్లు సంపదలతో నిండి ఉంటుందని నమ్ముతారు.

మనలో ప్రతి ఒక్కరు ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటాం. వాస్తు శాస్త్ర ప్రకారం లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభసంకేతాలను తీసుకొస్తుంది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇంట్లోకి నల్ల చీమలు గుంపుగా చేరి ఏదైనా వస్తువుని తినడం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడుతుందని అర్థం. ఈ విషయాన్ని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అంతేకాదు ఉదయాన్నే లేవగానే అనుకోకుండా ఒక తెల్లని పక్షి గనక మనకి కనిపిస్తే లేదా ఆ పక్షి గూడు కట్టుకుంటే కనిపిస్తే అది చాలా శుభసూచకంగా ఉంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల ప‌క్షి గూడు క‌ట్టుకున్న‌ చెట్టును నరికితే దానివల్ల ఆశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరొకటి ఏంటంటే మూడు బల్లులు గనక ఇంట్లో ఒక్క చోట కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని అర్థం అన్నమాట.

these signs will show if you are about to get luck

ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కుక్క కనిపించినా సరే అది చాలా శుభసంకేతంగా పెద్దలందరూ భావిస్తూ ఉంటారు. అలాగే బంగారం కలలోకి వస్తే అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు. ఇక ఇంట్లోకి ధనం రావడం ఎవ్వరూ ఆపలేరు. అపార సంపదలు మన జీవితంలోకి వస్తాయని అదే సంకేతమని చెబుతున్నారు. అలాగే కలలోకి ధాన్యం వస్తే ధాన్యాల గురించి కలలు కనడం అంటే అదృష్టం మనకి సమృద్ధిగా ఎదురు చూస్తుందని అర్థం. మన కలలో కొబ్బరికాయ గనక కనిపించినట్లయితే త్వ‌ర‌లో మన ఇంట్లో సంప‌ద అడుగు పెడుతుందని అర్థంగా భావిస్తారు. లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని చెబుతారు. ఇలా మ‌న‌కు అదృష్టం ప‌ట్టే ముందు కొన్ని సంకేతాలు క‌నిపిస్తాయి.

Admin

Recent Posts