వినోదం

Allu Arjun : మెగా ఫ్యామిలీతో బ‌న్నీకి ఎక్క‌డ చెడింది.. అస‌లు కార‌ణం ఇదేనా..?

Allu Arjun : ఒక‌ప్పుడు బ‌న్నీ మెగా ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ త‌ర్వాత క్ర‌మ‌క్ర‌మంగా అల్లు పేరుతోనే ఎక్కువ‌గా ఫేమ‌స్ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా మెగా, అల్లు కుటుంబాల గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది. మెగా Vs అల్లు ఫ్యాన్స్ వార్ హాట్ టాపిక్ అవుతోంది. ఈ రెండు కుటుంబాల నడుమ వివాదాలు తలెత్తాయని చెప్పుకుంటూ పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇరు కుటుంబాల్లో లోలోపల‌ ఏదో జరుగుతోందనే ప్రచారాలు బాగానే జరిగాయి. రుద్ర‌మ‌దేవి సినిమా ఫంక్ష‌న్లో ఫ్యాన్స్ ప‌వ‌న్ గురించి మాట్లాడ‌మ‌ని కేక‌లు వేస్తుంటే బ‌న్నీ చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అన‌డం ద‌గ్గ‌ర నుంచే ఈ గ్యాప్‌, చీలిక స్ప‌ష్టంగా వ‌చ్చేసింది.

ఆ ఒక్క‌సారి మాత్ర‌మే కాదు.. త‌ర్వాత కూడా బ‌న్నీ మెగాభిమానులు, ప‌వ‌న్ అభిమానుల‌ను కాస్త రెచ్చ‌గొట్టేలా మాట్లాడార‌ని ఆరోపిస్తున్నారు. అల్లు అర్జున్ తనకంటూ వేరే టీమ్‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మెయింటేన్ చేస్తున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయ్. పుష్ప సినిమా రిలీజ్ టైమ్‌లో ఫ్యాన్ మీట్స్ అంటూ తన రేంజ్ ఎంటో చూపించే ప్రయత్నాలు చేశారు. ఇదంతా చూసిన చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమానుల్లో అల్లు అర్జున్ మెగా హీరోగా కాకుండా అల్లు వారి వారసుడిగానే భావించాల్సిన అవసరం ఏమొచ్చిందని కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

this may be the reason for allu and mega family war

అయితే బ‌న్నీ ఎందుకు ఇలా చేస్తున్నాడు. త‌న ఫ్యామిలీని పైకి లేప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడా. ఆయ‌న మ‌న‌సులో త‌న తాత వ‌ల్లే చిరంజీవి ఈ స్థాయికి వ‌చ్చారా అనే ఫీలింగ్ ఉందా అనే అనుమానాలు అంద‌రి మ‌దిలో మెదులుతున్నాయి. అల్లు రామ‌లింగ‌య్య వ‌ల్లే చిరు మెగాస్టార్ అయితే మ‌రి.. రామ‌లింగ‌య్య త‌న కొడుకు అల్లు అర‌వింద్‌ను కూడా స్టార్‌ను చేసుకునేవాడు క‌దా అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక్క‌డ చెప్పుకోవ‌ల‌సింది ఏంటంటే అల్లు రామ‌లింగ‌య్య త‌న అల్లుడు చిరంజీవి చేసే సినిమాలు ఎక్క‌డా ఆగ‌కుండా తెర‌వెన‌క ఫైనాన్స్ అందేలా చేయ‌డంలో మాత్రం త‌న‌వంతుగా సాయం చేశార‌ట‌. అలా అల్లు రామ‌లింగ‌య్య కొంత సాయం చేయ‌డం, చిరు త‌న న‌ట‌న‌, డ్యాన్సులు, మాస్ ప్రేక్ష‌కుల‌ను ఊపేయ‌డంతో మెగాస్టార్ గా ఎదిగాడు. అయితే మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మ‌ధ్య విభేదాలు లేవ‌ని అర‌వింద్ ప‌దే ప‌దే చెబుతున్నా కూడా పుకార్లు ఆగ‌డం లేదు.

Admin

Recent Posts