Post Office Scheme : దేశంలోని పౌరులకు పోస్టాఫీస్ అనేక పథకాలను అందిస్తోంది. వాటిల్లో డబ్బును పొదుపు చేస్తే ఆ డబ్బు సురక్షితంగా ఉండడమే కాదు.. వడ్డీ కూడా అధికంగా లభిస్తుంది. చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునే వారికి పోస్టాఫీస్ మనీ సేవింగ్ స్కీమ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక పోస్టాఫీస్ అందిస్తున్న అలాంటి పథకాల్లో స్మాల్ సేవింగ్స్ స్కీమ్ (Monthly Income Scheme) కూడా ఒకటి. ఇందులో డబ్బును కనీసం రూ.1000తో పొదుపు చేయవచ్చు.
పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లో భాగంగా రూ.1000 అంతకన్నా ఎక్కువ మొత్తం గరిష్టంగా రూ.4.50 లక్షల వరకు ఒక వ్యక్తి పొదుపు చేయవచ్చు. అలాగే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ స్కీమ్‌లో గరిష్టంగా రూ.9 లక్షలు పొదుపు చేయవచ్చు. ఈ క్రమంలో ఏడాదికి 6.6 శాతం వడ్డీ చెల్లిస్తారు. వడ్డీని నెల నెలా పొందవచ్చు. పోస్టాఫీస్‌లోనే సేవింగ్స్ ఖాతా ఉంటే ఈ వడ్డీని నేరుగా ఆ ఖాతాకు నెల నెలా బదిలీ చేస్తారు. దీంతో సులభంగా నెల నెలా వడ్డీ లభిస్తుంది.
దేశంలోని పౌరులు ఎవరైనా సరే ఈ పథకంలో సింగిల్ లేదా జాయింట్ ఖాతాలను తెరవచ్చు. చిన్నపిల్లలు అయితే 10 ఏళ్లు పైబడిన వారు ఈ పథకంలో చేరవచ్చు. తల్లి, తండ్రి లేదా సంరక్షకులు ఉండాలి.
ఇక ఈ పథకంలో చేరిన వారు జాయింట్ ఖాతా ద్వారా రూ.9 లక్షలు పొదుపు చేస్తే ఏడాదికి రూ.59,400 వస్తాయి. అంటే నెలకు రూ.4,950 వస్తాయన్నమాట. ఇలా ఈ మొత్తాన్ని నెల నెలా ఆదాయంగా పొందవచ్చు. అలాగే డబ్బుకు రక్షణ కూడా ఉంటుంది.