Mahesh Babu : బోయ‌పాటి శ్రీ‌నుకు మ‌హేష్ ఫ్యాన్స్ సెగ‌.. ఆగ్ర‌హంతో ఊగిపోతున్న అభిమానులు..

Mahesh Babu : మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుకు మ‌హేష్ బాబు ఫ్యాన్స్ నుంచి సెగ త‌గిలింది. బోయ‌పాటి మాట్లాడిన మాట‌ల‌కు మ‌హేష్ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. ఓ వేడుక‌లో భాగంగా కొంద‌రు హీరోల‌కు చెందిన సేవాత‌త్వం గురించి బోయ‌పాటి కామెంట్స్ చేశారు. అయితే అంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ ఆ లిస్ట్‌లో ఆయ‌న మ‌హేష్ పేరు చెప్ప‌డం మ‌రిచారు. దీంతో మ‌హేష్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Mahesh Babu fans are very angry on boyapati srinu
Mahesh Babu

సూర్య న‌టించిన తాజా చిత్రం ఈటీ.. ఈ నెల 10వ తేదీన విడుద‌ల కానుంది. అందులో భాగంగానే ప్రీ రిలీజ్ వేడుక‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ద‌ర్శ‌కుడు బోయ‌పాటితోపాటు రానా, గోపీచంద్ మ‌లినేని ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. అయిత కార్య‌క్ర‌మంలో భాగంగా అఖండ సినిమా డైలాగ్స్ చెప్పాల‌ని ఫ్యాన్స్ హోరెత్తించారు. దీంతో బోయ‌పాటి వారికి స‌ర్ది చెప్పారు. త‌రువాత సూర్య గురించి మాట్లాడుతూ.. సూర్య చాలా మాన‌వ‌త్వం ఉన్న వ్య‌క్తి అని.. అందరికీ స‌హాయం చేస్తార‌ని అన్నారు. ఆయ‌న ఎంతో మందికి హార్ట్ ఆప‌రేష‌న్ల‌ను ఉచితంగా చేయిస్తున్నార‌ని కొనియాడారు.

అలాగే బ‌స‌వ తార‌కం క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ పేరిట బాల‌కృష్ణ చేస్తున్న సేవ‌ల‌ను బోయ‌పాటి కొనియాడారు. బ్ల‌డ్ బ్యాంక్‌, ఐ బ్యాంక్ పేరిట చిరంజీవి చేస్తున్న సేవ‌ల‌ను పొగిడారు. కానీ మ‌హేష్ బాబు పేరు చెప్ప‌లేదు. వాస్త‌వానికి మ‌హేష్ బాబు కూడా ఎంతో సేవ చేస్తున్నారు. పేద‌ల‌కు ఉచితంగా ఆప‌రేష‌న్లు చేయిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 1200 మందికి పైగా చిన్నారుల‌కు గుండె ఆప‌రేష‌న్స్ చేయించారు. అయితే మ‌హేష్ చేస్తున్న సేవ‌ల గురించి బోయ‌పాటి చెప్ప‌లేదు. దీంతో మ‌హేష్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌హేష్ బాబు చేస్తున్న సేవ‌ల‌ను మ‌రిచావా బోయ‌పాటి, ఆయ‌న 1200 మందికి పైగా చిన్నారుల‌కు ఉచితంగా ఆప‌రేష‌న్లు చేయించారు, ఆ విష‌యం ఎందుకు చెప్ప‌లేదు.. అంటూ మ‌హేష్ ఫ్యాన్స్ బోయ‌పాటిని విమ‌ర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనిపై బోయ‌పాటి స్పందించాల్సి ఉంది.

Editor

Recent Posts