Tomato Biryani : ట‌మాటా బిర్యానీ ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. మొత్తం తింటారు..!

Tomato Biryani : ట‌మాట బిర్యానీ.. ట‌మాటాల‌తో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. రైతా, మ‌సాలా కూర‌, కుర్మా కూర‌ల‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ బిర్యానీ చాలా చ‌క్క‌గా ఉంటుంది. ట‌మాటాల‌తో త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు, వెరైటీగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ బిర్యానీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ట‌మాట బిర్యానీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, సాజీరా – అర టీ స్పూన్, బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 4, అనాస పువ్వు – 1, స్టోన్ ప్ల‌వ‌ర్ – కొద్దిగా, యాల‌కులు – 3, జాప‌త్రి – కొద్దిగా, జీడిప‌ప్పు – కొద్దిగా, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన బీన్స్ – 10, త‌రిగిన పెద్ద బంగాళాదుంప – 1, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, త‌రిగిన ట‌మాటాలు – పెద్ద‌వి మూడు, ఉప్పు – త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ఒక‌టిన్న‌ర గ్లాస్, అర‌గంట పాటు నాన‌బెట్టిన బియ్యం – ఒక గ్లాస్, కారం – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీస్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, పుదీనా ఆకులు – గుప్పెడు.

Tomato Biryani recipe in teugu tasty one
Tomato Biryani

ట‌మాట బిర్యానీ త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు, జీడిప‌ప్పు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత కూర‌గాయ ముక్క‌లు, ట‌మాట ముక్క‌లు, క‌రివేపాకు వేసి క‌ల‌పాలి. వీటిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌ల‌పాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డే వ‌ర‌కు వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత కారం, గ‌రం మ‌సాలా, ధ‌నియాల పొడి, కొత్తిమీర‌, పుదీనా వేసి క‌ల‌పాలి. త‌రువాత బియ్యం వేసి క‌ల‌పాలి. ఇప్పుడుకుక్క‌ర్ మూత పెట్టి 2 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని ఆవిరి పోయిన త‌రువాత మూత తీసి అంతా క‌లిసేలా క‌లుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట బిర్యానీ త‌యారవుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts