Jojoba Oil For Hair : జుట్టు ఒత్తుగా, పొడవుగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్నో రకాల జుట్టు సంరక్షణ చర్యలు చేపడుతూ ఉంటారు. అయినప్పటికి మనలో చాలా మంది అనేక రకాల జట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు సమస్యలతో బాధపడే వారు, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకునే వారు జోజోబా నూనెను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జోజోబా నూనె మనకు ఆన్ లైన్ లో చాలా సులభంగా లభిస్తుంది. దీనిని జుట్టు రాసి మర్దనా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మన జుట్టుకు జోజోబా నూనె ఎంతో మేలు చేస్తుంది. ఈ నూనెలో జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి.
ఈ నూనె సహజ సిద్దమైనది కనుక దీనిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. జుట్టు ఆరోగ్యం కొరుకు జోజోబా నూనెను వాడడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టుకు జోజోబా నూనెను రాయడం వల్ల జుట్టు విరిగిపోకుండా ఉంటుంది. ఇది జుట్టుకు కండిష్నర్ గా పని చేస్తుంది. ఈ నూనెను వాడడం వల్ల జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. జుట్టును అందంగా, ఆరోగ్యంగా, పొడవుగా పెరిగేలా చేయడంలో ఈ నూనె మనకు ఎంతో సహాయపడుతుంది. ఈ నూనెను వాడడం వల్ల జుట్టు పట్టుకుచ్చులా, మృదువుగా, కాంతివంతంగా తయారువుతుంది. అలాగే ఈ నూనెను వాడడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. తల చర్మం తేమగా ఉంచి చుండ్రు సమస్య మన దరి చేరకుండా చేయడంలో అలాగే తలలో దురద వంటి ఇన్పెక్షన్ లను తగ్గించడంలో జోజోబా నూనె మనకు ఎతో దోహదపడుతుంది.
ఈ నూనెను వాడడం వల్ల తలలో పిహెచ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. జుట్టు చివర్లు చిట్లడం, జుట్టు ఎక్కువగా చిక్కుబడడం వంటి సమస్యలతో బాధపడే వారు ఈ నూనెను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ జోజోబా నూనెను నేరుగా జుట్టుకు పట్టించి మర్దనా చేసుకోవచ్చు. అలాగే ఇతర నూనెలతో కలిపి కూడా జుట్టుకు పట్టించవచ్చు. అలాగే ఈ నూనెతో హెయిర్ మాస్క్ ను తయారు చేసి కూడా వాడుకోవచ్చు. ఈ హెయిర్ మాస్క్ ను తయారు చేసుకోవడానికి ఒక జార్ లో జోజోబా నూనె, అరటిపండు, షియా బటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి జుట్టు చివరి వరకు బాగా పట్టించాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా ఈ విధంగా వాడినా కూడా జోజోబా నూనె మన జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ విధంగా జోజోబా నూనె మన జుట్టుకు ఎంతో మేలు చేస్తుందని దీనిని వాడడం వల్ల జుట్టు సమస్యలన్నీ తొలగిపోయి జుట్టు అందంగా, నల్లగా, పొడవుగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.