Hotel Style Mutton Fry : హోట‌ల్స్‌లో అందించే మెత్త‌ని మ‌ట‌న్ ఫ్రై.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి..!

Hotel Style Mutton Fry : మ‌న‌కు హోట‌ల్స్ లో ల‌భించే నాన్ వెజ్ వెరైటీల‌ల్లో మ‌ట‌న్ ఫ్రై కూడా ఒక‌టి. బ‌య‌ట హోట‌ల్స్ లో ల‌భించే ఈ మ‌ట‌న్ ప్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. బ‌య‌ట హోట‌ల్స్ లో ల‌భించే ఈ మ‌ట‌న్ ఫ్రైను అదే రుచితో మనం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. వంట‌రాని వారు బ్యాచిల‌ర్స్ కూడా ఈ మ‌ట‌న్ ఫ్రైను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. హోట‌ల్ స్టైల్ మ‌ట‌న్ ఫ్రైను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హోట‌ల్ స్టైల్ మ‌ట‌న్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Hotel Style Mutton Fry recipe very easy to make
Hotel Style Mutton Fry

మ‌సాలా పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, సోంపు గింజ‌లు – అర టీస్పూన్, ఎండుమిర్చి – 4.

మ‌ట‌న్ ఉడికించడానికి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసిన మ‌ట‌న్ – అర‌కిలో, ఉప్పు – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క‌- ఒక ఇంచు ముక్క‌,లవంగాలు – 4, బిర్యానీ ఆకు – 1, నీళ్లు – ఒక గ్లాస్.

హోట‌ల్ స్టైల్ మ‌ట‌న్ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో మ‌ట‌న్ ను వేసుకోవాలి. త‌రువాత ఇందులో మిగిలిన ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసుకోవాలి. త‌రువాత కుక్క‌ర్ మూత పెట్టి 4 నుండి 5 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో మ‌సాలా పొడి కోసం క‌ళాయిలో ధ‌నియాలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత జీల‌క‌ర్ర‌, మిరియాలు, సోంపు గింజ‌లు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత వీటిని జార్ లో తీసుకుని మెత్త‌ని పొడిగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత క‌రివేపాకు కూడా వేసి వేయించాలి.

ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ఉడికించిన మ‌ట‌న్ ను నీటితో స‌హా వేసుకోవాలి. నీరంతా పోయి నూనె పైకి తేలే వ‌ర‌కు మ‌ట‌న్ బాగా వేయించాలి. మ‌ట‌న్ చ‌క్క‌గా వేగి నూనె పైకి తేలిన త‌రువాత మ‌సాలా పొడి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ ఫ్రై త‌యార‌వుతుంది. ఈ విధంగా ఇంట్లోనే హోట‌ల్ స్టైల్ మ‌ట‌న్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts