Vicks : విక్స్‌ను మీరైతే సాధారణంగా దేనికి వాడుతారు..? దేనికి వాడడం ఏమిటి.. జలుబు, తలనొప్పి, దగ్గు, ముక్కు దిబ్బడ వంటి శ్వాసకోశ సమస్యల నివారిణిగా దాన్ని ఉపయోగిస్తారు. కొద్దిగా తీసుకుని సంబంధిత భాగాల్లో రాసుకుంటే వెంటనే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కదా.. ఇంకా కొత్తగా దీన్ని ఏయే ఉపయోగాల కోసం వాడుతారు..? అని అడగబోతున్నారా..? అయితే మీరు అడుగుతోంది కరెక్టే. విక్స్‌ను కేవలం పైన చెప్పిన సమస్యలకే కాదు, ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. దాంతో మనం పొందే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్లుల్లి రెబ్బలపై కొద్దిగా విక్స్ రాసి వాటిని ముక్కు వద్ద పెట్టుకుని గట్టిగా శ్వాస పీల్చాలి. దీంతో సైనస్ తలనొప్పి తగ్గిపోతుంది.
కొద్దిగా విక్స్‌ను తీసుకుని దానికి కొంత వేజలిన్ కలపాలి. ఆ మిశ్రమాన్ని చర్మానికి లేదంటే బట్టలకు రాసుకుంటే దోమలు కుట్టవు. రోజుకు కనీసం 3 సార్లు విక్స్‌ను మొటిమలపై క్రమం తప్పకుండా రాస్తుంటే మొటిమలు తగ్గిపోతాయి. కొద్దిగా విక్స్‌ను తీసుకుని చెవుల వెనుక, మోచేతులపై, మెడపై, మోకాళ్లపై రాసుకుంటే కీటకాలు, పురుగులు, ఈగలు వాలవు. విక్స్ డబ్బాను ఓపెన్ చేసి ఆహార పదార్థాలకు సమీపంలో ఉంచితే అక్కడ ఈగలు వాలవు. గాయం అయిన చోట విక్స్ రాస్తే త్వరగా ఆ గాయం తగ్గిపోతుంది. శరీరంలో కండరాలు నొప్పులు ఉంటే ఆ ప్రదేశాల్లో విక్స్‌ను రాసి బాగా మర్దనా చేయాలి. అనంతరం టవల్‌తో గట్టిగా వేడి ఉండేలా చుట్టాలి. దీంతో కండరాల నొప్పులు తగ్గిపోతాయి. చర్మం తడి ఆరిపోయి పొడిగా మారి ఇబ్బందులు పెడుతుంటే విక్స్ రాయాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది.
విక్స్, మెంథాల్, కర్పూరంలను బాగా కలిపి మోచేతిపై పెట్టుకుంటే టెన్నిస్ ఎల్బో సమస్య ఉండదు. రాత్రి పూట పాదాలకు విక్స్‌ను రాసి సాక్స్‌లు వేసుకోవాలి. ఉదయాన్నే సాక్సులను తీసి వేడి నీటితో కాళ్లను కడగాలి. దీంతో పాదాల పగుళ్లు పోతాయి. కాలి వేళ్లకు ఫంగస్ ఇన్‌ఫెక్షన్ వస్తే ఆ ప్రదేశంలో విక్స్ రాయాలి. తరచూ ఇలా చేస్తుంటే ఇన్‌ఫెక్షన్ పోతుంది. గొంతు లేదా ఛాతిపై కొద్దిగా విక్స్ రాసి మర్దనా చేస్తే ముక్కు దిబ్బడ, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చర్మం సాగిపోయినట్టుగా మార్క్‌లు ఏర్పడితే ఆయా ప్రదేశాల్లో విక్స్ రాయాలి. 2 వారాల పాటు ఇలా చేస్తే స్ట్రెచ్ మార్క్స్ పోతాయి.
ఇంట్లో పిల్లి, కుక్క వంటి జంతువులను పెంచుకుంటుంటే అవి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తుంటే ఇంట్లోని గదుల్లో ఓ మూలకు విక్స్ డబ్బాలను ఓపెన్ చేసి పెట్టాలి. దీంతో ఆ సమస్య ఉండదు. చర్మంపై దురదలు వస్తుంటే విక్స్ రాయాలి. దీంతో ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కొద్దిగా కాటన్ తీసుకుని దానికి విక్స్ రాసి చెవిలో పెట్టుకుంటే చెవి నొప్పి తగ్గిపోతుంది.