Fashion Accessories : మ‌హిళ‌లు నిత్యం ధ‌రించే ఈ 10 యాక్స‌స‌రీల వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయో తెలుసా..? తప్పక తెలుసుకోండి..!

Fashion Accessories : ఫ్యాష‌న్‌గా ఉండే దుస్తులు, ఇత‌ర యాక్స‌స‌రీలు చూసేందుకు ఆక‌ర్ష‌ణీయంగా, ధ‌రించేందుకు క‌మ్‌ఫ‌ర్ట్‌గా ఉంటాయి. కానీ.. వాటి వ‌ల్ల వ‌చ్చే ఇబ్బందుల‌ను మాత్రం ఎవ‌రూ గ‌మ‌నించ‌డం లేదు. ఎందుకంటే.. అలాంటి వాటి వ‌ల్ల 73 శాతం మంది మ‌హిళ‌లు వెన్నెముక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నార‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఫ్యాష‌న్ దుస్తులు, యాక్స‌స‌రీల వ‌ల్ల మ‌హిళ‌ల‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో తెలిసింది. మ‌రి ఏయే ఐట‌మ్స్ వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో ఇప్పుడు తెలుసుకుందామా. నేటి త‌రుణంలో స్కిన్ టైట్ జీన్స్ ధ‌రించ‌డం ఫ్యాష‌న్ అయిపోయింది. అలాగే టైట్‌గా ఉండే లెగ్గింగ్స్ వంటివి కూడా ధ‌రిస్తున్నారు. వీటి వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డుతుంది. ర‌క్త నాళాల్లో రక్తం సుల‌భంగా ర‌వాణా అవ‌దు. అడ్డంకులు ఏర్ప‌డుతాయి.

దీంతో జీర్ణ‌ప్ర‌క్రియ నెమ్మ‌దిస్తుంది. న‌రాల‌పై ఒత్తిడి ఎక్కువ‌గా ప‌డుతుంది. తొడ‌ల్లో నొప్పులు వ‌స్తాయి. స్ప‌ర్శ లేకుండా పోతుంది. కనుక టైట్‌గా ఉండే ప్యాంట్ల‌ను ధ‌రించ‌రాదు. ఆబ‌ర్న్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు తాజాగా చేసిన అధ్య‌య‌నాలు ఏం చెబుతున్నాయంటే.. పురుషుల క‌న్నా మ‌హిళ‌ల‌కే పాదాల సంబంధిత అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ట‌. అది ఎలాగో ఇప్ప‌టికే మీకు తెలిసిపోయి ఉంటుంది. హై హీల్స్ వాడ‌కం వ‌ల్ల‌. అవును, అవే. వాటి వ‌ల్ల జాయింట్ పెయిన్స్‌, మ‌డ‌మ‌ల వాపు, నొప్పి, ఆస్టియో ఆర్థ‌రైటిస్‌, న‌రాల డ్యామేజ్ వంటి స‌మ‌స్య‌ల వస్తున్నాయ‌ని, అవి బాగా తీవ్రంగా మారుతున్నాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. క‌నుక మ‌హిళ‌లు హై హీల్స్ వాడ‌డం మానేస్తే మంచిది.

women must stop wearing these 10 types of Fashion Accessories
Fashion Accessories

థాంగ్స్‌.. ఇదొక ర‌క‌మైన అండ‌ర్‌వేర్‌. బిగుతుగా ఉంటుంది. దీంతో పైన టైట్ ప్యాంట్ల‌కు చెప్పిన లాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. దీనికి తోడు యోని ఇన్‌ఫెక్ష‌న్లు, హెమ‌రాయిడ్స్, ర్యాషెస్ వ‌స్తాయి. జ‌న‌నావ‌య‌వాల వ‌ద్ద ఉండే చ‌ర్మం సెన్సిటివ్ అవుతుంది. బాక్టీరియా ఇన్ఫెక్ష‌న్లు వ‌స్తాయి. కనుక థాంగ్స్‌ను ధ‌రించ‌క‌పోవ‌డ‌మే బెట‌ర్‌. నేటి త‌రుణంలో ఇయ‌ర్ రింగ్స్ ధ‌రించే మ‌హిళల్లో 20 శాతం మంది ఇన్‌ఫెక్ష‌న్ల బారిన ప‌డుతున్న‌ట్లు అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. అయితే ఇయ‌ర్ రింగ్స్‌ను స‌రిగ్గా స్టిచ్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే ఈ ఇన్ఫెక్ష‌న్లు వ‌స్తున్న‌ట్లు నిర్దారించారు. దీనికి తోడు భారీ సైజ్‌లో ఉండే ఇయ‌ర్ రింగ్స్‌, నెక్లెస్‌లు వాడ‌డం వ‌ల్ల చెవి త‌మ్మెలు త‌మ స‌హ‌జ‌సిద్ధ‌మైన సాగే గుణాన్ని కోల్పోతాయి. దీని వ‌ల్ల మెడ నొప్పి వ‌స్తుంది. కాబ‌ట్టి ఇయ‌ర్ రింగ్స్ పెట్టుకునేందుకు చెవుల‌ను కుట్టించుకునే స‌మ‌యంలో జాగ్ర‌త్త వ‌హించాలి. అలాగే భారీ ఇయ‌ర్ రింగ్స్‌, నెక్లెస్‌లు ధ‌రించ‌రాదు.

నేటి త‌రుణంలో కేవ‌లం మ‌హిళ‌లు మాత్ర‌మే కాదు, పురుషులు కూడా తమ మెడ అస‌లు సైజ్ క‌న్నా త‌క్కువ సైజ్ ఉన్న ష‌ర్ట్‌ల‌ను కొంటున్నార‌ట‌. ఇలాంటి వారు ప్ర‌పంచంలో 67 శాతం మంది ఉన్నార‌ని, వీరు మెడ నొప్పి, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నార‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. దీంతోపాటు వీరికి ర‌క్త స‌ర‌ఫ‌రాల్లో ఆటంకాలు ఏర్ప‌డుతున్నాయ‌ట‌. అలాగే టైలు ఎక్కువ‌గా వాడ‌డం వ‌ల్ల కూడా ఇలాంటి స‌మ‌స్య‌లే వ‌స్తున్న‌ట్లు సైంటిస్టులు చెబుతున్నారు. నేటి త‌రుణంలో చాలా మంది మ‌హిళ‌లు బ్రాల‌ను అస‌లు స‌రిగ్గా సైజ్ చూడ‌కుండానే వాడుతున్న‌ట్లు అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. దీంతో వారికి బ్యాక్ పెయిన్‌, భుజాలు, వెన్నెముక నొప్పి వంటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ట‌. క‌నుక ఇలాంటి మ‌హిళలు బ్రాల‌ను వాడేముందు వాటి సైజ్ స‌రిగ్గా చూసుకోవ‌డం మంచిది.

బీచ్‌లో, ఇండ్లలో తిరిగేందుకు ఫ్లిప్ ఫ్లాప్స్‌ను చాలా మంది వేసుకుంటారు. అయితే ఇవి చాలా కమ్‌ఫ‌ర్ట్‌గా ఉన్న‌ప్ప‌టికీ వీటి వ‌ల్ల పాదాల‌పై ఒత్తిడి ప‌డుతుంది. ఫ‌లితంగా అక్క‌డి నుంచి వెన్నెముక‌కు ఉండే న‌రాలపై భారం ప‌డి వెన్ను నొప్పి స‌మ‌స్య వ‌స్తుంది. లావుగా ఉన్న వారు శ‌రీరం నాజూగ్గా, స్లిమ్‌గా క‌నిపించేందుకు షేప్ వేర్‌ను ధ‌రిస్తుంటారు. ఇవి మంచివి కావు. శ్వాస స‌మ‌స్య‌లు, కండ‌రాల నొప్పులను క‌లిగిస్తాయి. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాకు అడ్డంకులు ఏర్ప‌డుతాయి. క‌నుక వీటిని వాడ‌క‌పోవ‌డ‌మే మంచిది. మ‌హిళ‌లు చాలా మంది హ్యాండ్ బ్యాగ్స్‌ను వాడుతారు. అయితే కొంద‌రు మాత్రం మ‌రీ స్టైల్‌గా క‌నిపించాల‌ని చెప్పి పెద్ద హ్యాండ్ బ్యాగుల‌ను వాడుతారు. నిజానికి ఇవి మంచివి కావు. ఇవి భుజాలు, కండ‌రాలు, కీళ్ల నొప్పుల‌ను క‌లిగిస్తాయి. క‌నుక ఎక్స్‌ట్రా లార్జ్ హ్యాండ్ బ్యాగుల‌ను వాడ‌క‌పోవ‌డ‌మే మంచిది.

పెన్సిల్ స్క‌ర్ట్స్.. ఇవి కాళ్ల‌ను ఎప్పుడూ ద‌గ్గ‌రిగా ఉండేలా చేస్తాయి. దీంతో శ‌రీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ న‌డిచేందుకు క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది. దీనికి తోడు బాడీ మూవ్‌మెంట్ స‌రిగ్గా ఉండ‌దు. కూర్చున్నా, నిలుచున్నా క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. కండ‌రాల‌పై ఒత్తిడి ప‌డుతుంది. మోకాళ్ల‌పై భారం ప‌డుతుంది. దీంతో ఆయా ప్ర‌దేశాల్లో నొప్పులు వ‌స్తాయి. కాబ‌ట్టి ఇలాంటి స్క‌ర్ట్‌ల‌ను వాడే ముందు ఒక‌సారి ఆలోచించండి.

Editor

Recent Posts