Milk : ఇంట్లో పాలు పొంగితే.. ఆ రోజు ఇంట్లో.. ఏం జరుగుతుందో తెలుసా ?

Milk : అప్పుడ‌ప్పుడూ పాల‌ను స్ట‌వ్ మీద ఉంచి ఏదో ఆలోచిస్తూ లేదా వేరే ప‌నిలో ప‌డి స్ట‌వ్ మీద ఉంచిన పాల‌ను మ‌రిచిపోవ‌డం స‌హ‌జంగానే జ‌రుగుతుంటుంది. ఆలోచన‌ నుండి తేరుకుని పాలు గుర్తుకు వ‌చ్చే స‌రికి పాలు పొంగి పోయి ఉంటాయి లేదా పాలు బాగా మ‌రిగి ప‌నికిరాకుండా అవుతాయి. ఇలా స‌హ‌జంగానే అప్పుడప్పుడూ అంద‌రి ఇండ్ల‌ల్లోనూ జ‌రుగుతూనే ఉంటుంది. కానీ కొంద‌రు పాలు పొంగ‌డాన్ని అశుభంగా భావిస్తూ ఉంటారు. కొంద‌రు పాలు పొంగడాన్ని శుభంగా భావిస్తారు. అస‌లు పాలు పొంగ‌డం మంచిదా కాదా.. అన్న విష‌యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

తూర్పు దిక్కును శుభ సూచ‌కంగా భావించి చాలా మంది తూర్పు దిక్కున పాల‌ను పొంగిస్తూ ఉంటారు. ఈ విధంగా చేస్తే అదృష్టం, సంప‌ద‌, శాంతి, ఆరోగ్యం క‌లుగుతుంద‌ని భావిస్తారు. తూర్పు దిక్కు నుండి వ‌చ్చే పాజిటివ్ ఎన‌ర్జీతో అదృష్టం క‌లుగుతుంద‌ని తూర్పు దిక్కున పాల‌ను పొంగించే ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. తూర్పు దిక్కున పాల‌ను పొంగిస్తే అంతా మంచే జ‌రుగుతుంద‌ని ఒక న‌మ్మ‌కం.

what happens if Milk boils and flown away
Milk

పాలు పొంగ‌డం మంచిది అని కొంద‌రు, మంచిది కాద‌ని కొంద‌రు అంటుంటారు. పాలు పొగ‌డం శుభ ప‌రిణామానికి సంకేతంగా చెప్తూ ఉంటారు. పాలు సంప‌ద‌కు, స‌మృద్ధికి సంకేతం. అలాగే శుద్దికి ప్ర‌తీక పాలు. స్వ‌చ్చ‌మైన ఆవు పాలను య‌జ్ఞాల‌లో, ఇత‌ర దైవ కార్య‌క్ర‌మాల‌లో ఉప‌యోగిస్తూ ఉంటారు. క‌నుక పాలు పొంగ‌డం మంచిదే అని.. పాలు పొంగ‌డం వ‌ల్ల ధ‌నం ఇంట్లోకి రావ‌డానికి సూచ‌న వంటిద‌ని పండితులు చెబుతున్నారు. పాల‌ను పొంగించినా లేదా అనుకోకుండా అవి పొంగినా కూడా మంచిదే అని పండితులు చెబుతున్నారు.

Share
D

Recent Posts