Bathing : స్నానం చేయడానికి కూడా ఒక సమయం ఉంటుంది. చాలా మంది వారి వర్క్, ఇంట్లో పనులు, ఇతర కారణాల వలన వారికి నచ్చిన సమయానికి స్నానం చేస్తూ ఉంటారు. కానీ ఈ టైం లో స్నానం చేయడం చాలా మంచిది. తెల్లవారుజామున నాలుగు నుండి ఐదు గంటల మధ్యలో స్నానం చేయడం అత్యుత్తమం. ఇలా చేసే స్నానాన్ని ఋషి స్నానం అని అంటారు. ఐదు నుండి ఆరు గంటల మధ్య స్నానం చేస్తే దేవస్థానం అంటారు. ఇది మధ్యమ ఫలితాన్ని ఇస్తుంది. ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్నానం చేస్తే మానవ స్నానం అంటారు.
ఇది అథమం.
అదే 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ఋషి స్నానం చేస్తే ఎంతో శుభం కలుగుతుంది. అది చాలా మంచిది. అదే విధంగా తలంటు పోసుకోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆదివారం తలస్నానం చేస్తే తాపం పోతుంది. సోమవారంనాడు తలస్నానం చేస్తే అందం పెరుగుతుంది. మంగళవారం చేయడం అమంగళం.
బుధవారం నాడు చేస్తే వ్యాపార, వ్యవహార అభివృద్ధి కలుగుతుంది. గురువారం నాడు ధన నాశనం. శుక్రవారం నాడు తలస్నానం చేస్తే అనుకోని ఆపదలు కలుగుతాయి. శనివారం నాడు తల స్నానం చేస్తే మహా భోగములు కలిసి వస్తాయి. అయితే ఈ స్నానం విధి కేవలం పురుషులకి మాత్రమే. అదే విధంగా నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.
తూర్పు దిశకు తల పెట్టి నిద్రపోతే సుఖం, సంతోషం కలుగుతాయి. ఉత్తర దిశకు తలపెట్టి పడుకుంటే అనారోగ్యం, మరణం. పడమర వైపు నిద్రిస్తే ఆందోళన కలుగుతుంది. దక్షిణ దిశకు తలపెట్టి నిద్రపోతే కీర్తి, విద్య, శాంతి కలుగుతాయి. ఈశాన్యం వైపు తలపెట్టి నిద్రపోతే కలహాలు, రుణాలు. ఆగ్నేయం వైపు నిద్రపోవడం వలన రుణ బాధలు కలుగుతాయి. నైరుతి వైపు తలపెట్టి నిద్రపోతే అభివృద్ధి కలుగుతుంది. వాయువ్యం వైపు తలపెట్టి నిద్రపోతే పిచ్చి ఆలోచనలు వస్తాయి.