information

మీ ద‌గ్గ‌ర ఈ పాత రూ.1 నోటు ఉందా ? అయితే రూ.7 ల‌క్ష‌లు వ‌స్తాయి..!

పాత క‌రెన్సీ నోట్లు లేదా కాయిన్ల‌ను క‌లెక్ట్ చేసేవారు చాలా మంది ఉంటారు. చాలా మంది వాటిని ఒక హాబీగా క‌లెక్ట్ చేస్తుంటారు. అయితే అలాంటి పాత క‌రెన్సీ నోట్లు లేదా కాయిన్లు ఉంటే రూ.ల‌క్ష‌లు పొంద‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఓ పాత రూ.1 నోటుకు ఏకంగా రూ.7 ల‌క్ష‌ల దాకా పొందే అవ‌కాశం ల‌భిస్తోంది.

స‌ద‌రు పాత రూ.1 నోటును భార‌త ప్ర‌భుత్వం 26 ఏళ్ల కింద‌టే నిలిపివేసింది. కానీ జ‌న‌వ‌రి 2015లో మ‌ళ్లీ ఆ నోటు ముద్ర‌ణ‌ను కొన‌సాగించారు. దీంతో కొత్త రూపంలో ఆ నోటును మ‌ళ్లీ చెలామణీలోకి తెచ్చారు. అయితే ఇప్పుడు మేం చెబుతున్న‌ది కొత్త నోటు గురించి కాదు, పాత నోటు గురించి. ఆ నోటు స్వాతంత్య్రం రాక ముందు చెలామ‌ణీలో ఉండేది. దానికి ఇప్పుడు భారీ మొత్తంలో డ‌బ్బులు పొంద‌వ‌చ్చు.

if you have this one rupee coin then you can get rs 7 lakhs

భార‌త‌దేశానికి స్వాతంత్య్రం రాక‌ముందు ఉన్న పాత రూ.1 నోటుకు రూ.7 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌స్తాయి. దానిపై అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ జేడ‌బ్ల్యూ కెల్లీ సంత‌కం ఉంటుంది. ఆ నోటు సుమారుగా 80 ఏళ్ల కింద‌టిది. 1935లో దాన్ని ఇష్యూ చేశారు. అలాగే 1966లో ముద్రించ‌బ‌డిన ఇంకో పాత రూ.1 నోటుకుకు డ‌బ్బులు వ‌స్తాయి. 1949, 1957, 1964 ఏళ్లలో ఇష్యూ చేయ‌బ‌డిన రూ.1 నోటుకు రూ.35వేలు పొంద‌వ‌చ్చు. ఈబే (eBay) అనే వెబ్‌సైట్‌లో ఆ నోట్ల‌ను అమ్మ‌కానికి ఉంచాలి. దీంతో ఆ మొత్తాల‌కు ఆ నోట్ల‌ను అమ్ముకోవ‌చ్చు.

Admin

Recent Posts