ఆధ్యాత్మికం

తిరుమలలో గోవింద నామస్మరణ చేయడానికి వెనుక ఉన్న పురాణ కథ ఏమిటో తెలుసా?

కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి ఎంతో ప్రసిద్ధి చెంది. ఇక్కడ వెలిసిన స్వామివారి దర్శనార్థం రోజుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. తిరుమల కొండపైకి వెళ్లే భక్తులకు అక్కడ మార్మోగుతున్న గోవింద నామ స్మరణం వింటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. మరి తిరుపతిలో ఈ విధంగా గోవింద నామస్మరణ చేయడానికి గల కారణం… దాని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటో తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం గోకులంలో ప్రజలని ఇంద్ర దేవుడు తనను పూజించాలని తెలుపగా, శ్రీకృష్ణుడు ఇంద్రుడిని పూజించాల్సిన పని లేదని చెప్పడంతో గోకులంలోని ప్రజలు ఎవరు కేంద్ర దేవుడిని పూజించాలి. ఈ విషయంలో ఎంతో ఆగ్రహం చెందిన ఇంద్ర దేవుడు గోకులం పై మెరుపు దాడితో అతి భయంకరమైన వర్షాన్ని కురిపిస్తాడు. వర్షం నుంచి గోకులంలోని ప్రజలను కాపాడటం కోసమే శ్రీకృష్ణుడు గోవర్ధన గిరి పర్వతం ఎత్తాడు. ఇది చూసిన ఇంట్లో దేవుడు తాను చేసిన తప్పును గ్రహించి కృష్ణుడిని క్షమాపణ కోరడానికి వెళ్తాడు.

what is the reason behind govinda nama smarana in tirumala

ఇంద్ర దేవుడు శ్రీకృష్ణుడికి క్షమాపణ చెప్పడానికి వెళ్తున్న సమయంలో కృష్ణుడు వద్దకు కామదేనువు వచ్చి తన బిడ్డలైన గోవుల్ని రక్షించాలన్న ఎందుకు కృతజ్ఞతగా శ్రీకృష్ణునికి పాలాభిషేకం చేస్తుంది. ఈ అద్భుతాన్ని చూస్తూ పరవశించిపోయిన ఇంత దేవుడు కృష్ణుడు వద్దకు చేరుకుని నేను కేవలం దేవుళ్లకు మాత్రమే అధిపతిని.. కానీ నువ్వు గోవులకు కూడా అధిపతివి కనుక ఈ సమయం నుంచి మీరు గోవిందుగా పిలవబడతారు అని చెప్పడంతో అప్పటినుంచి తిరుపతిలో గోవింద నామ స్మరణం తో వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు.

Admin

Recent Posts