వైద్య విజ్ఞానం

టాబ్లెట్లు చేదుగా ఉన్నాయా..? ఇలా మింగేందుకు ట్రై చేయండి..!

మనకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్లచే పరీక్ష చేయించుకుని వారు రాసే మందులను తెచ్చుకుని మింగుతుంటాం. దీంతో ఆ అనారోగ్య సమస్యల నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది. వాటి నుంచి మనం బయటపడతాం. అయితే దాదాపుగా ఏ టానిక్ లేదా మందు బిళ్ల అయినా సరే.. చేదుగానే ఉంటుంది. దీంతో ఆ చేదు మందులను మింగాలంటే కొందరు జంకుతుంటారు. అయితే అసలు నిజానికి ఏ మందు బిళ్లలనైనా ఎలా మింగాలో తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం..

మందు బిళ్లను మింగేందుకు మనకు రెండు ఉత్తమమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి..

* ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలి. అందులో తగింత నీరు నింపుకోవాలి.

* మీరు మింగాలనుకునే టాబ్లెట్‌ను నాలుక మీద పెట్టుకోవాలి. రుచికళిలకు దూరంగా నాలుకపై టాబ్లెట్‌ను ఉంచాలి. లేదంటే చేదు తగులుతుంది.

* అనంతరం బాటిల్ ఓపెనింగ్‌ను పెదాలకు దగ్గరగా పెట్టుకుని పెదాలను ఆ ఓపెనింగ్ చుట్టూ బిగించి నీటిని తాగాలి.

* అలా నోట్లోకి గాలి చొరబడకుండా టాబ్లెట్‌ను మింగాలి.

how to swallow tablets 2 easy methods

ఇక టాబ్లెట్లను మింగేందుకు మరొక పద్ధతి…

* టాబ్లెట్‌ను నాలుక మీద పెట్టుకోవాలి.

* నీళ్లను ఒక సిప్ వేసి కొంత నీటిని నోట్లోకి తీసుకోవాలి. కానీ టాబ్లెట్‌ను మింగకూడదు.

* గడ్డాన్ని కొద్దిగా కిందకు దించాలి.

* ఆ తరువాత తల కిందకు వంగగానే టాబ్లెట్‌ను, నీటిని కలిపి మింగాలి.

పైన చెప్పిన రెండు పద్ధతులు టాబ్లెట్లను మింగేందుకు అనువైనవి. వీటి ద్వారా 80 శాతం వరకు టాబ్లెట్లను చాలా సులభంగా మింగవచ్చు. అయితే టాబ్లెట్లను బాగా మింగగలిగే వారు ఈ పద్ధతులను పాటించాల్సిన పనిలేదు. తమకు తోచినట్లుగా టాబ్లెట్లను మింగవచ్చు. అదే టాబ్లెట్లను మింగేందుకు జంకే వారు ఈ పద్ధతులను పాటించవచ్చు. కానీ ఈ కొత్త పద్ధతులను పాటించే ముందు ఎందుకైనా మంచిది.. జాగ్రత్త వహించండి.. పక్కనే ఎవరైనా ఉండేట్లు చూసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి టాబ్లెట్లు గొంతులో ఇరుక్కుని (చోకింగ్) ప్రాణాలు పోయేందుకు అవకాశం ఉంటుంది. కనుక టాబ్లెట్లను మింగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి..!

Admin

Recent Posts